»   » అవకాశాల కోసం పడకగదుల్లోకి వెళ్తారు.... : కొత్త చిక్కుల్లో ఇలియానా

అవకాశాల కోసం పడకగదుల్లోకి వెళ్తారు.... : కొత్త చిక్కుల్లో ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

"మీడియా నా వ్యాఖ్యలని వక్రీకరించింది" జెనరల్ గా ఏదైనా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసారు అనగానే దాదాపుగా సెలబ్రిటీలంతా వాడే మాటే ఇది. అయితే చాలా సార్లు మీడియాని ఇలా వాడుకుంటారు తప్ప దాదాపుగా వక్రీకరించటం తక్కువే. అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్ లోనే జరిగింది. అన్న మాటలని వక్రీకరించటం కాదు. అసలు అనని మాటలను చెప్పటమే కాదు ఏకంగా ఇలియానా ఇచ్చింది అంటూ ఒక ఇంటర్వ్యూనే వేసేసారట.

ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు

ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు

దేవదాసు లాంటి భారీ హిట్‌తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన ఇలియానా ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోల పక్కన నటించింది. భారీ హిట్లను సొంతం చేసుకొన్నది ఇలియానా. పరిశ్రమలో తనకన్నా వయస్సులో పెద్ద హీరోయిన్లు కూడా రాణిస్తుంటే ఇలియానా మాత్రం ఈ మధ్య కాలంలో ఒక్క సినిమా చేసిన దాఖలాలు లేవు.అలాంటి సంధర్భం లో ఇలియానా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కొందరు ఎంతకైనా దిగజారుతారు

కొందరు ఎంతకైనా దిగజారుతారు

సినీ ఆఫర్ల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైపు నాది కాదు. అవకాశాల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారు. ఛాన్సులు ఇవ్వమని ఎవరినీ ప్రాధేయపడను. అందుకే అవకాశాళు తగ్గాయి తప్ప మరో కారణం కాదు అని ఇలియానా ఇటీవల ఓ మీడియాతో చెప్పినట్టు వచ్చింది. అంతే ఈ మాటల మీద చిన్న సైజు దుమారం కూడా రేగింది

లైంగికంగా లొంగిపోవాలి

లైంగికంగా లొంగిపోవాలి

ఈ మధ్య ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలంటే నిర్మాత, దర్శకుడూ, లేదంటే ఆసినిమా హీరో తో లైంగికంగా లొంగిపోవాల్సిన పరిస్థితి ఉందంటూ, ఎన్నోసారు తమను చాలామంది లైంగికంగా వేదించారంటూ చాలామంది హీరోయిన్లే బహిరంగంగా చెప్పిన విశయం తెలిసిందే. ఆ టాపిక్ తీవ్రంగా ఉన్నప్పుడే ఈ ఇంటర్వ్యూ వచ్చిందట.

పడకగదుల్లోకి వెళ్లవలసిన అవసరం లేదు

పడకగదుల్లోకి వెళ్లవలసిన అవసరం లేదు

ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా ‘అవకాశాల కోసం పడకగదుల్లోకి వెళ్లవలసిన అవసరం లేదు' అని చెప్పినట్టు వేసారు. ఎటూ ఎలాగూ ఆ రంగంలో జరిగే దాన్నే ఇలియానా బహిరంగంగా చెప్పి ఉంటుంది అని అందరూ అనుకున్నారు. సినీ ఇండస్ట్రీ లో ఒజ్కప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంది గనక ఆ మాటలు నిజమా, కాదా అంటూ పెద్దగా ఎవరూ ఆరాతీయలేదు.

షాక్ తిందట

షాక్ తిందట

అయితే రీసెంట్ గా ఆ ఇంటర్వ్యూ ని చూసుకున్న ఇల్లూ... ఒక్క సారి షాక్ తిందట. ఏదో ఒక మాట అయితే ఓకే గానీ ఏకంగా తాను ఇచ్చానంటూ ఒక ఇంటర్వ్యూనే కనిపించేసరికి ఏం చేయాలో అర్థం కాలేదట. అసలు విషయం ఏమిటంటే అసలు అలాంటి మాటలు ఎక్కడా ఎవరితోనూ మాట్లాడలేదట.

విదేశాల్లో ఉంది

విదేశాల్లో ఉంది

అసలు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది అని చెబుతున్న సమయంలో ఇలియానా ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా విదేశాల్లో ఉంది. తిరిగి వచ్చి తన మీద వచ్చిన వార్తలను చూసి ఇలియానా నోరు వెళ్ళబెడుతోందట. అనని మాటలని అన్నట్టుగానో, లేదంటే వాటిని మరో అర్థం లోనో రాసేవాళ్ళని చూసాను గానీ అసలు ఏకంగా తాను ఇచ్చినట్టుబ్ ఇంటర్వ్యూనే రాసేయటం అర్థం కాక అసలు ఆ మాటలు నేను అనలేదు మొర్రో అంటోంది ఇల్లూ...

English summary
I did not gave any interview and I dint talk those words says Ileana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu