ద ఫ్యామిలీ సీజన్ 2.. మొదలయ్యేది అప్పటి నుంచే, అంతకుమించి అనేలా సమంత రోల్

వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కాన్సెప్ట్ లకు సీక్వెల్ క్రియేట్ అవుతున్నాయి. ఇక అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ద ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఫస్ట్ సీజన్ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ షోలో మనోజ్ బాజ్ పయ్ ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇక ఫిమేల్ లీడ్ లో ప్రియమణి నటించింది. సెకండ్ సీజన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా సమంత అక్కినేని కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుండడం వలన అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది తెలుగు దర్శకులే. రాజ్ - డీకే ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకులే. ఇక మొదటి నుంచి బాలీవుడ్ వైపు అడుగులు వేయడంతో అక్కడ డిఫరెంట్ గా వారి టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు.

The Family Man season 2 likely to premiere on June 1st week

ఇక ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ పై కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జూన్ మొదటి వారం నుంచి కూడా అమెజాన్ ప్రైమ్ లో మొదలు కానున్నట్లు సమాచారం. మొదటి సీజన్ కంటే ఈ సీజన్ లో ఎమోషనల్ హై డ్రామా ఎక్కువగానే ఉంటుందట. ఇక సమంత పాత్ర నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని టాక్ వస్తోంది. ఆమె ఒక పవర్ఫుల్ ఉగ్రవాదిగా నటించినట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X