»   » 'తిక్క కుదిరిందా బ్రదర్', బన్ని ఫ్యాన్స్ రివేంజ్ ఇలా

'తిక్క కుదిరిందా బ్రదర్', బన్ని ఫ్యాన్స్ రివేంజ్ ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సాయి ధరమ్ తేజ తాజా చిత్రం తిక్క డిజాస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. బాబు బంగారం పూర్ రివ్యూలు వచ్చాయి, టాక్ పెద్దగా లేదు..తిక్కకు కలిసి వస్తుంది, సాయి హాట్రిక్ కొడుతాడు అనుకుంటే అందరినీ నిరాశపరిచింది.

అయితే సీన్ రివర్స్ అయ్యి...బాబు బంగారం కు బిలో యావరేజ్ టాక్ వచ్చింది. తిక్కను క్రిటిక్స్ దగ్గర నుంచి అందరూ తిట్టిపోసారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ...సోషల్ మీడియాలో ట్రెండింగ్ సాయి ధరమ్ తేజకు వ్యతిరేకంగా "#‎ThikkaKudirindhaBrother" అని మొదలెట్టారు.


తిక్క ఆడియో ఫంక్షన్ లో ...అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేయకపోయినప్పటికీ , అంతా అల్లు అర్జున్ కు సాయి ధరమ్ తేజ కౌంటర్ వేసాడని ఫీలయ్యారు. తిక్క ఆడియో పంక్షన్ లో సాయి ధరమ్ తేజ మాట్లాడుతూ... అరుస్తాను బ్రదర్...మీరు ఎన్నిసార్లు అరవమంటే అన్నిసార్లు అరుస్తాను. అన్నమాటలు అంతటా చర్చించబడ్డాయి. ఇప్పుడు ఇలా బన్ని ఫ్యాన్స్ సాయి ధరమ్ తేజని కౌంటర్ ఇచ్చారన్నమాట.


#‎ThikkaKudirindhaBrother - Allu Arjun fans revenge on Sai Dharam Teja

శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్‌ పతాకంపై రోహిణ్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సునీల్‌రెడ్డి దర్శకత్వం వహించారు. మొన్న శుక్రవారం( ఈ నెల 13న )విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.


మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ...ప్రేక్షకులు, అభిమానుల నుంచి వచ్చిన సూచనలపై స్పందించిన చిత్ర యూనిట్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 'తిక్క' చిత్ర నిడివిని 10 నిమిషాలు తగ్గించింది.


భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. లరిస్సా బోన్సి, మన్నారా చోప్రా, రాజేంద్ర ప్రసాద్‌, ముమైత్‌ఖాన్‌, అలీ, అజయ్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చారు.


తిక్క కథేమిటంటే...ఆదిత్య (సాయిధరమ్‌ తేజ్‌) మందు,మగువ లైఫ్ అని ఓ జల్సారాయుడు. అలాంటి ఈ కుర్రాడు ఓ రోజు అంజలి (లరిస్సా బోన్సి) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని సైట్ కొట్టి,కొట్టి,ఆమెను ఒప్పిస్తాడు. అంతేకాకుండా ఆమె కోసం తనను తాను మార్చుకుంటాడు. కానీ ఓ రోజు ఆమె హఠాత్తుగా కొన్నిసిల్లీ రీజన్స్ సాకుగా చూపించి బ్రేకప్‌ చెప్పి బై అంటుంది అంజలి.


వెళ్తూ.. వెళ్తూ ఓ ఉత్తరం ఆదిత్య జేబులో పెట్టి వెళుతుంది. అంజలి దూరమైందన్న బాధతో ఫ్రెండ్స్ తో కలసి తెగ తాగేస్తాడు ఆదిత్య. ఆ హ్యాగోవర్ లో చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులు వల్ల మొత్తం మారిపోతుంది. రకరకాల కన్ఫూజన్స్ ఏర్పడతాయి.ఆ కన్ఫూజన్స్ ఏమిటి? అంజలి బ్రేకప్ కి అసలు రీజన్ ఏమిటి? అసలా లెటర్ లో ఏముంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్, ఆ సక్సెస్ ట్రాక్‌ను అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో 'తిక్క' అనే మరో కామెడీతో ఈ రోజు వచ్చాడు. ఆ చిత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో నష్ట నివారణా చర్యలు మొదలెట్టారు నిర్మాతలు.

English summary
Bunny fans are so happy with the result of Thikka and they started trending "#‎ThikkaKudirindhaBrother" on twitter. This fan war in between Mega heros is so interesting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu