»   »  ‘తుంగ‌భ‌ద్ర’ విడుదల తేదీ ఖరారు

‘తుంగ‌భ‌ద్ర’ విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఆదిత్, డింపుల్ జంటగా వారాహి చలనచిత్రం పతాకంపై శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకత్వంలో సాయి కొర్రపాటి రూపొందిస్తున్న చిత్రం ‘తుంగభద్ర'. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరి ప్రశంసలూ పొందుతోంది. పల్లెటూరి నేపధ్యంలో పగలు, ప్రతీకారాలు మధ్య సాగే ప్రేమ కథగా రూపొందిది. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా మార్చి 6న విడుదల చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘ఈగ', ‘అందాల రాక్షసి', ‘లెజెండ్', ‘ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్య' చిత్రాలతో ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్నారు సాయి కొర్రపాటి. తాజాగా వారాహి చలన చిత్రం బ్యానర్ నుండి వస్తున్న చిత్రం ‘తుంగభద్ర'.

సాయికొర్రపాటి మాట్లాడుతూ ‘'గతేడాది బాలకృష్ణగారితో ‘లెజెండ్' సినిమా చేశాను అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత మా బ్యానర్ లో వచ్చిన ‘ఉహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్య' చిత్రాలు సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. అలాగే ఈ ఏడాది మా వారాహి చలనచిత్రం బ్యానర్ లో వస్తున్న చిత్రం ‘తుంగభద్ర'. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలై మంచి సక్సెస్ ను సాధించింది.

Thungabhadra releases on March, 6th.

హరి గౌర సంగీతానికి మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీనివాస కృష్ణగోగినేని దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. సినిమాను బ్యూటిఫుల్ లవ్ స్టోరిగా తెరకెక్కించారు. ప్రతి సీన్ ఒక ఫీల్ ను కలిగించేలా ఉంటుంది. ఆదిత్, డింపుల్, సత్యరాజ్, కోటశ్రీనివాస రావు, చలపతి రావు తమ పాత్రలకు గొప్పగా న్యాయం చేశారు.

హరిగౌర సంగీతం, రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ ప్లస్ అవుతాయి. అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రమవుతుంది. సెన్సార్ సహా సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 6న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.

ఆదిత్, డింపుల్ చోపడే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కోటశ్రీనివాసరావు, సత్యరాజ్, చలపతిరావు, సప్తగిరి, కోటశంకరరావు, పవిత్రా లోకేష్, రాజేశ్వరి నాయర్, ధనరాజ్, నవీన్ నేని, రవివర్మ, జబర్ దస్త్ శ్రీను, చరణ్, శశాంక్, కల్పలత, శ్రీనివాస్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి సాహిత్యం: సాహితి, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, రాధా సుబ్రహ్మణ్యం, గణేష్ సలాది, పైట్స్: నందు, డ్రాగన్ ప్రకాష్, సాల్మన్ రాజ్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, ఆర్ట్: హరివర్మ, కొరియోగ్రఫీ: శంకర్, ఎడిటింగ్: తమ్మిరాజు, సంగీతం: హరి గౌర, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, కో ప్రొడక్షన్: సిల్లి మాంక్స్, నిర్మాత: రజని కొర్రపాటి, రచన-దర్శకత్వం: శ్రీనివాసకృష్ణ గోగినేని.

English summary
Adit, Dimple Chopade's ‘Thungabhadra’ directed by Srinivasa Krishna Gogineni is readying for grand release on March, 6th. Film is produced by Sai Korrapathi on his Varahi Chalana Chitram banner.
Please Wait while comments are loading...