»   » "తిక్క" మోషన్ పోస్టర్ వచ్చేస్తోంది...

"తిక్క" మోషన్ పోస్టర్ వచ్చేస్తోంది...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సుప్రీమ్' సినిమాతో హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్, 'తిక్క' సినిమాను పూర్తిచేసే పనిలో వున్నాడు. ఈ సంద‌ర్బంగా నిర్మాత డాక్ట‌ర్‌.సి.రోహిన్ రెడ్డి మాట్లాడుతూ..ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్మాత రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ, సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని చెప్పాడు. ఈ సినిమా ఫస్టులుక్ గా ఈ నెల 25వ తేదీన 'మోషన్ పోస్టర్' ను రిలీజ్ చేయనున్నామని అన్నాడు.

"Tikka" motion poster on June 25th

శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్న చిత్రం 'తిక్క' మోష‌న్ పోస్ట‌ర్ ని జూన్ 25న విడుద‌ల చేయ‌నున్నాము. మోష‌న్ పోస్ట‌ర్ ని కొత్త‌గా చేశాము, అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రానికి సునీల్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ల‌రిస్సా బోన్సి, మ‌న్నార చోప్రాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్ర‌స్తుతం పాటల చిత్రీక‌ర‌ణ‌లో వున్న మా చిత్రం మ‌రో రెండు సాంగ్స్ చిత్రీక‌ర‌ణ‌తో పూర్త‌వుతుంది. థ‌మ‌న్ అందించిన ఆడియో అటు మెగా అభిమానుల‌కే కాకుండా సామ‌న్య సినీ ల‌వ‌ర్స్ కూడా విప‌రీతంగా న‌చ్చుతుంది.

మా హీరో సాయి ధ‌ర‌మ్‌ తేజ్ ఎనర్జీ కి స‌ర‌పోయో ఆడియో థ‌మ‌న్ అందించాడు. అతిత్వ‌ర‌లో టీజ‌ర్ ని విడుద‌ల చేసి ఆడియోని మెగా అభిమానుల స‌మ‌క్షంలో జులై మెద‌టి వారంలో విడుద‌ల చేయ‌నున్నాము. శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ జ‌రుపుకుంటున్న మా చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై మూడ‌వ వారంలో చిత్రాన్ని విడుదల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నాము. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలా మా 'తిక్క‌' చిత్రం వుంటుంద‌ని ఆశిస్తున్నాము. అని అన్నారు...

English summary
Young supreme Hero sai dharam tej's New Movie "tikka" completed 75% of shooting and on June 25th producers planing to release a motion poster
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu