»   »  తెలుగులో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరోయిన్ ఆమె ఐతే కాదు, మరి??

తెలుగులో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే హీరోయిన్ ఆమె ఐతే కాదు, మరి??

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పెద్ద సినిమాలకు వెళ్లేటప్పుడు సాధారణంగా హీరో ఎవరని ఎలా అడుగుతామో, హీరోయిన్ ఎవరో కూడా తెలుసుకోవాలని ఆసక్తి చూపుతూంటాము. స్టార్ హీరోయిన్స్ ఆ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే స్టార్ హీరోయిన్స్ ఓ రేంజిలో వెలిగిపోతూంటారు. డిమాండ్ కు తగ్గట్లే రెమ్యునేషన్స్ కూడా ఉంటాయి.

అప్పట్లో సావిత్రి, వాణిశ్రీ, భానుమతి వంటి గొప్ప హీరోయిన్స్ తాము ఏ పాత్ర చేసినా, వన్నె తెచ్చేవారు. అలాగే వారి రెమ్యునేషన్స్ కూడా టాప్ లో ఉండేవి. అప్పట్లో వారు ఇండస్ట్రీలో మహారాణులుగా చెలామణి అయ్యేవారు. మరి ఇప్పుడు తెలుగులో ఎవరు ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు..తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కదా.

మీరంతా ఎవరు టాప్ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు అనుకుంటున్నారు...సమంత కదా..అయితే అక్కడ మీరు తప్పులో కాలేసారు. తెలుగులో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ అనుష్క. ఆమె తాజాగా ఒప్పుకున్న భాగమతి చిత్రం నిమిత్తం అక్షరాలా రెండున్నర కోట్లు రూపాయలు తీసుకుంటోందని వార్త.

యువి క్రియేషన్స్ వారు, పిల్ల జమీందార్ అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మిస్తపన్నారు. ఈ చిత్రాన్ని తమిళ,మళయాళ, హిందీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే అనుష్కను ప్రధాన పాత్రలో ఎంచుకున్నారు. ఇదో థ్రిల్లర్. ఇక క్రింద ఏ హీరోయిన్ ఎంత రెమ్యునేషన్ తీసుకోబోతున్నారనే స్లైడ్ షోలో ఇచ్చాం..గమనించండి..

గమనిక : క్రింద పేర్కొన్న హీరోయిన్స్ రెమ్యునేషన్స్ ట్రేడ్ లో ప్రచారంలో ఉన్నవి మాత్రమే..అవి ఖచ్చితమైన లెక్కలు కావచ్చు..కాకపోవచ్చు....పెరగవచ్చు..తగ్గవచ్చు... పూర్తి పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు.

మన తెలుగు టాప్ హీరోయిన్స్ ...స్లైడ్ షోలో...

నిత్యామీనన్

నిత్యామీనన్

తెలుగులో నిత్యామీనన్ కు మంచి డిమాండ్ ఉంది. కాకపోతే ఆమె తన నటనతో డామినేట్ చేస్తుందని యంగ్ హీరోలు కొందరు భయపడుతున్నారు కానీ..ఆమె మాత్రం మొదట స్క్రిప్టు విని, తర్వాత రెమ్యునేషన్ నచ్చితేనే ఓకే అంటుంది. రుద్రమదేవి కోటి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా పెంచిదని తెలుస్తోంది. అంతేనా ఆమె డేట్స్ కోసం చాలా కాలం వెయిట్ చెయ్యాలి. కథ చెప్పాలంటే ఆమె గతంలో ఏ సినిమాలు చేసారో మొత్తం చెక్ చేస్తుంది.

తమన్నా

తమన్నా


మిల్కి బ్యూటి తమన్న కెరీర్ మెదట్లో ఓ యాడ్ కోసం తీసుకున్న రేమ్యూనరేషన్ కేవలం రెండు వేలు మాత్రమే. మెదటి సినిమా ప్లాప్ అయినా, శేఖర్ ఖమ్ముల హ్యాపిడేస్ సినిమా తన కెరీర్ ఒక్కసారిగా మార్చేసింది. ఇప్పటికే ఈ అమ్మడు సుమారు కోటి రూపాయలు తీసుంకుంటోందని తెలుస్తోంది. ఆలాగే ఐటమ్ పాటలకు ఓ నలబై లక్షలవరకూ తీసుకుంటోందని తెలుస్తోంది. దీనితో పాటు కార్ వ్యెన్ కూడా నెలకు మూడు లక్షల వరకు అవుతోందట.

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌' సినిమాతో శ్రుతిహాసన్ తన కెరీర్‌ ను పూర్తిగా మార్చుకుంది. అంతకుముందు వరకు ఫ్లాప్ హీరోయిన్ అయిన ఈ బ్యూటి ఓక్కసారిగా లక్కీ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు శ్రుతితో సినిమా అంటే దాదాపు రూ.1.25 కోట్లు తీసుకుంటోంద. కాకపోతే కోరిన హోటెల్‌ నుంచే భోజనాలు రావాలనే అంక్షలు పెట్టకుండా సినిమాలను పూర్తి చేస్తు, నిర్మాతలకు ఇబ్బంది కలిగించదట.

అనుష్క

అనుష్క


అరుంధతి సినిమాతో ఒక్కసారీగా లేడీ స్టార్ డమ్ ను సాదించుకున్న హీరోయిన్ అనుష్క. ప్రస్తుతం ఈమె పారితోషికం ‘కోటి'కి పైమాటేనని అనుకుంటున్నారు. సైజ్‌ జీరో సినిమా ఫ్లాప్ అయినా, మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క పారితోషికం రూ.2.5 కోట్ల తీసుకుంటోంది

కాజల్

కాజల్

లక్ష్మీ కళ్యాణం, చందమామ, సినిమాలు హిట్ అయినా చిన్న మెత్తంలో తీసుకుంది. కానీ రామ్ చరన్ ‘మగధీర' విజయంతో కాజల్‌ పారితోషికం రూ.1.10 కోట్ల వరకూ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', ‘బ్రహ్మోత్సవం' సినిమాల్లో నటిస్తూ బిజిగా వుంది. రాబోతున్న సినిమాలుక 1.20 కోట్టుకు పెంచుతుందని సమాచారం.

సమంత

సమంత

ఏమాయ చేసావె సినిమాతోనే సుపర్ హిట్ అందుకున్న సమంతా, వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటించి, తన డిమాండ్ ను రూ.1.10 కోట్లు నుంచి 1.25 కోట్ల వరకూ పెంచిందని ఓ అంచనా. షూటింగ్‌ సమయంలో ఫైవ్ స్టార్ హోటళ్లలో వుండాలని కండీషన్ కూడా వుందట. తన అసిస్టేంట్ ఖర్చులు, రానుపోను విమాన ఖర్చులు అన్ని నిర్మాతలే భరించాలి. నెలవారీ అదనపు ఖర్చులు దాదాపుగా రూ.5 లక్షల రూపాయల వరకూ ఉండొచ్చని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమా హిట్ అవ్వడంతో అదే ఎక్స్‌ప్రెస్‌ వేగంతో దూసుకుపోతోంది రకుల్‌. ప్రస్తుతం ఈమే పారితోషికం సుమారు రూ.80 లక్షల నుంచీ కోటి రూపాయల వరకూ ఉందని తెలుస్తోంది. ‘బ్రూస్‌లీ'కి ముందు కోటిరూపాయలు డిమాండ్‌ చేసిన రకుల్‌... ఆ తరవాత కాస్త తగ్గిందట. ఈమధ్య ఓ పెద్ద హీరో సినిమా కోసం రూ.60 లక్షలకే ఒప్పుకొందట.

త్రిష

త్రిష

తెలుగులో త్రిషకు అంత సీనుందా..డిమాండ్ చేయటమేంటి అనుకుంటున్నారా... ఉంది...ఆమెను ఇప్పటికీ చాలా నిర్మాణ సంస్దలు అడుగుతున్నాయి. ఆమె కోటి పాతిక లక్షలు, ప్లస్ ఆమె తల్లితో పాటు వస్తుంది..స్టార్ హోటల్, వ్యానిటీ వ్యాన్ డిమాండ్ చేస్తోంది. ఇష్టమున్నవాళ్లే పెట్టుకుంటారు.

నయనతార

నయనతార

తన అందంతో, అభినయంతో అకట్టుకునే ఈ భామ ఈ మధ్యే వెంకటేష్ సినిమాకు సుమారు రెండు కోట్ల రూపాయలు అడిగినట్టు సమాచారం. అటు హాట్ గాను, ఇటు ఫ్యామిలికి నప్పేయడంతో ఇలా పెద్ద మెత్తంలో వసూలుచేస్తోంది. ఇంత మెత్తం ఇచ్చినా ‘ప్రచారానికి రాను..' అని నిర్మాతలకు ముందే షరతు పెడుతోంది.

హన్సిక

హన్సిక

తమిళంకి వెళ్లిపోయిన ఈ దేశముదురు భామ...రెమ్యునేషన్ విషయంలోనూ, డిమాండ్స్ విషయంలోనూ చాలా ఖచ్చితంగా ఉంటుందని చెప్తారు. అందుకే తెలుగులో ఆమెను భరించలేమని చాలా మంది బైబై చెప్పేసారు. ఎనభై లక్షలు నుంచి కోటి దాకా డిమాండ్ చేస్తోంది జూనియర్ ఖుష్బూ.

ప్రణీత

ప్రణీత

అత్తారింటికి దారేది చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ కు వచ్చిన ఈ భామ..రభసలో గెస్ట్ రోల్ చేసింది. డిమాండ్స్ కన్నా రెమ్యునేషన్ విషయంలో గట్టిగా ఉంటుంది. అరవై లక్షలు దాకా వసూలు చేస్తోంది.

రాశీ ఖన్నా

రాశీ ఖన్నా

ఊహలు గుసగుసలాడే, జిల్ చిత్రాలతో బాగా రిజిస్టర్ అయిన భామ, నటనకన్నా గ్లామర్ కే మార్కులు ఎక్కువ పడతాయి. అందుకే ఆమె యాభై లక్షలు డిమాండ్ చేస్తోంది.

అంజలి

అంజలి

సీతమవాకిట్లో సిరిమల్లె చెట్టు, శంకరాభరణం అంటూ చేసిన ఈ భామ నిర్మాతల నుంచి తన డబ్బు ముక్కు పిండి వసూలు చేయటంలో ముందు ఉంటుందిట. ఆమె రెమ్యునేషన్ సినిమాని బట్టి యాభై నుంచి డబ్బై లక్షలు దాకా వసూలు చేస్తోంది.

రెజీనా

రెజీనా

మెగా హీరోయిన్ గా ముద్ర వేయించుకుని సినిమాలు చేస్తున్న ఈ భామ రీసెంట్ గా శౌర్య్ లో కూడా కనిపించింది. అరవై లక్షలు దాకా సినిమాకు వసూలు చేస్తోందని వినికిడి.

అవికాగోర్

అవికాగోర్

ఉయ్యాల జంపాలతో పరిచయమైన ఈ భామ...తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె మాత్రం తన డిమాండ్ తగ్గించుకోలేదట. యాభై లక్షలు ఇస్తేనే సినిమా చేస్తానని కండీషన్ పెడుతోంది.

తాప్సీ

తాప్సీ

తాప్సీ తనకు తెలుగు హిట్ లేకపోవచ్చు కానీ అలాగని తగ్గి సినిమాలు చేయాల్సిన అవసరం లేదన్నట్లు బిహేవ్ చేస్తోంది. మంచు కాంపౌండ్ తో టచ్ లో ఉండే ఈమె ముప్పై నుంచి యాభై దాకా వసూలు చేస్తోంది.

ఇలియానా

ఇలియానా

ఇంకా ఇలియానా ని ఎవరు అడుగుతారు అంటారా..మొన్ని మధ్య తని ఒరువన్ కోసం ఆమెను అడిగి, రెమ్యునేషన్ విని ఆగిపోయారు. మొన్న మొన్నటిదాకా తెలుగు చిత్రాల్లో తన అదృష్టంతో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా కోటిన్నర వరకూ తీసుకుంటోంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌కు చేరింది . అయినప్పటికీ ఇలియానా తెలుగులో ఇప్పుడు నటిస్తానంటే వరస ఆఫర్స్ తో బిజీ అవుతుందంటున్నారు. ఆమె క్రేజ్ ఇప్పటికీ తెలుగు తెరపై తగ్గలేదు.

కేథరిన్ థెరిస్సా

కేథరిన్ థెరిస్సా

ఈమెకు తొలినుంచీ భాక్సాఫీస్ కలిసి రావటం లేదు. అయినా ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. ఆమె ఇరవై లక్షలు తీసుకుంటోందని చెప్తున్నారు. చేసినవి తక్కువ చిత్రాలు అయినా క్రేజ్ తెచ్చుకోవటం ప్లస్ అయ్యింది

 నందిత

నందిత

పది లక్షలు నుంచి పదిహేను లక్షలు వరకూ నందిత తీసుకుంటున్నట్లు సమాచారం. ‘నీకు నాకు డాష్‌డాష్' చిత్రంతో పరిచయమైన నందిత కూడా తన తరువాతి చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్'తో మంచి నటిగా నిరూపించుకుంది.

English summary
Tollywood heroines remuneration and offers has seen highs and lows since few years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu