»   » వెండితెరపై మళ్లీ పోలీస్ పవర్ .. ఖాకీగా వస్తున్న కార్తీ..

వెండితెరపై మళ్లీ పోలీస్ పవర్ .. ఖాకీగా వస్తున్న కార్తీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మ్యూజిక్ రంగంలో గత 20 ఏళ్లుగా విశేష సేవలందించిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. తొలి ప్రయత్నంగా తమిళ చిత్రం ధీరణ్ అదిగరమ్ ఓండ్రు అనే సినిమాను తెలుగులోకి డబ్ చేస్తున్నది. ఈ చిత్రం తెలుగులో ఖాకీ పేరుతో విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రానికి ది పవర్ ఆఫ్ పోలీస్ అనేది ట్యాగ్‌లైన్. శతురంగ వెట్టై చిత్ర దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన కనిపిస్తున్నది.

Top Star Karthi coming as 'Khaki' -The Power of Police in Telugu

పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో తెరకెక్కిన ఖాకీ చిత్రంపై ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ఎండీ ఉమేశ్ గుప్తా ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగస్టు చివరి వారంలో గానీ, సెప్టెంబర్ తొలివారంలో గానీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తెలుగులో విజయం సాధించిన విక్రమార్కుడు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయగా అందులో కార్తీ నటించాడు. ఆ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకొన్నది. అదే మాదిరిగా ఈ చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Top Star Karthi coming as 'Khaki' -The Power of Police in Telugu
English summary
Aditya Music is who is a leading music label in Telugu for more than 20years is now making their debut into movie production. Aditya as their pilot project took up the dubbing rights of "Theeran Adhigaram Ondru" Tamil film. Karthi and Rakul Preet Singh are playing the lead roles in the movie. In the movie is directed by Sathuranga Vettai fame H. Vinoth. The makers were all set to release the first look of the film on Friday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu