»   » మళ్లీ మళ్లీ అదే తప్పు: జూ ఎన్టీఆర్‌కు పోలీసుల జరిమానా!

మళ్లీ మళ్లీ అదే తప్పు: జూ ఎన్టీఆర్‌కు పోలీసుల జరిమానా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. కారుకు నల్లటి అద్దాలు ఉన్నందున ఈ జరిమానా విధించారు. కారు అద్దాలకు నల్లటి ఫిల్మ్ (కూలింగ్ ఫిల్మ్) వాటాన్ని మన దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎన్టీఆర్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగిస్తున్నారు.

దేశంలో నేర సంఘటనలు పెరిగి పోతుండటంతో కార్ల అద్దాలకు అనుమతి లేకుండా బ్లాక్ ఫిల్మ్ వేసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలలో భాగంగా ఎస్‌ఆర్‌నగర్‌లో జూనియర్ ఎన్టీఆర్ కారు రేంజ్ రోవర్ నెంబర్ AP 37 AX 9999 కు బ్లాక్ ఫిల్మ్ ఉన్నట్లు గుర్తించారు. కారు ఆపిన పోలీసులు రూ.700 ఫైన్ విధించారు.

Traffic police fine for Jr NTR

గతంలోనూ జూ ఎన్టీఆర్ కారుకు పోలీసులు ఇదే విషయమై ఫైన్ విధించారు. ఇప్పటి వరకు మొత్తం 1400 ఫైన్ కట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రతి సారి ఫైన్ కడుతున్నారే తప్ప.... కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ మాత్రం తొలగించడం లేదు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఎన్టీఆర్ లాంటి నటులు ఇలా మళ్లీ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించడం ఏమిటి? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

జూ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే...
కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రం చేస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో మళయాల స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సమంత, నిత్ాయ మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Hyderabad Traffic police fine for Jr NTR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu