»   » లేడీ గెటప్ లో కేక పెట్టించాడే ఈ హీరో,కమల్ కి పోటీ వచ్చేటట్లు ఉన్నాడు (వీడియో)

లేడీ గెటప్ లో కేక పెట్టించాడే ఈ హీరో,కమల్ కి పోటీ వచ్చేటట్లు ఉన్నాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : శివకార్తికేయన్‌, కీర్తిసురేష్‌ జంటగా తెరకెక్కుతున్న రెండో సినిమా 'రెమో'. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఏఎం స్టూడియో నిర్మిస్తోంది. ఇందులో నటనాపరంగా శివకార్తికేయన్‌ ఓ అడుగు ముందుకేసి నర్సుగా కూడా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయింది. కొలవేరి అనిరుధిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిచారు. ఈ చిత్రం అక్టోబర్‌ విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.

నిర్మాత మాట్లాడుతూ.... '' దేశం గర్వించదగిన సినిమాటోగ్రాఫర్లలో పీసీ శ్రీరామ్‌ ఒకరు. మా సినిమాకు ఆయన పనిచేయడం గొప్పగా భావిస్తున్నాం. డబ్బింగ్‌ పనులు కొన్ని రోజుల క్రితం నుంచే జరుగుతున్నాయి. నిర్మాణాంతర పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నాం.''అని పేర్కొన్నారు.

ఇక యూనివర్శల్ స్టార్ కమల్‌హాసన్ నటించిన ఎన్నో విలక్షణ చిత్రాల్లో 'అవ్వై షణ్ముగి' ఒకటి. తెలుగులో 'భామనే సత్యభామనే'గా అమోఘ విజయాన్ని సాధించింది. నడి వయసు బ్రాహ్మణ స్ర్తీ పాత్రలో అత్యద్భుతంగా నటించి సరికొత్త ఒరవడి సృష్టించారు. అంతేకాదు ఆ పాత్రకి స్వయంగా తనే ఆడ గొంతుతో డబ్బింగ్‌ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇదే తరహాలో యువ నటుడు శివకార్తికేయన్ కూడా ప్రేక్షకుల్ని ఆశ్చర్యకితుల్ని చేయబోతున్నాడు.

Trailer of Sivakarthikeyan's Remo released

'రెమో' చిత్రంతో లేడీ గెట్‌పలో నటించడమే కాకుండా, స్వయంగా తనే ఆడ గొంతుతో డబ్బింగ్‌ చెప్పనున్నాడట. టీవీ షోల నుంచి సినిమాల్లోకి వచ్చిన శివకి మిమిక్రీ కూడా తెలుసు. తనకు పాపులారిటీ తెచ్చిన ఆ కళని 'రెమో' సినిమాలో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ చిత్రంలో శివకార్తికేయన్ లక్కీ హీరోయిన్ శ్రీదివ్య అతిథిగా దర్శనమీయనున్నారన్నది కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలు ఇటీవలే చిత్రీకరించినట్లు తెలిసింది. ఇందుతో శివకార్తికేయన్ అందమైన అమ్మాయిగా కనిపించనున్నారన్న విషయం తెలిసిందే.

దర్శకుడు కేఎస్.రవికుమార్ చిత్రంలోనూ దర్శకుడిగానే నటిస్తున్నారు. దీంతో ఇదేదో సినిమా నేపథ్యంలో సాగే చిత్రం అనిపిస్తోంది కదూ. ఈ విషయాలన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రెమో చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

English summary
The trailer of much awaited film Remo was released . It is a colourful video that gives an outline of the overall content in the flick. The trailer of Remo indicates that it will be a complete romantic entertainer loaded with fun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu