twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ 'రోబో ' ఎక్కడ ఎలా ఆడుతోంది..లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    తమిళులు అధికంగా వలస వెళ్లే మలేషియాలోనూ రోబో అదరగొడుతోందని సమాచారం. అక్కడ కూడా ప్రేక్షకులు టికెట్ల కోసం గంటలు తరబడి కౌంటర్ల దగ్గర కాపు కాస్తున్నారు. బ్లాక్ టిక్కెట్లు కోసం ఎగబడుతున్నారు. థియేటర్ల ముందు పెద్ద పెద్ద క్యూలు కడుతున్నారు. కౌలాలంపూర్‌కు చెందిన ముగ్గురు పూజారులు తమ ఆలయాల్లో శనివారం ఉదయమే పూజలు జరిపి సరాసరి రోబో సినిమాకు వెళ్లారని స్థానిక మీడియా వెల్లడించింది. మలేషియాతోపాటు సింగపూర్, మలేషియా, బ్రిటన్, చైనా, అమెరికాల్లో కూడా మొత్తం 300 ప్రింట్లను ప్రదర్శిస్తున్నారు.

    ఇక మన దేశం విషయానికి వస్తే బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కొన్ని థియేటర్లు తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటలకే 'రోబో'ను ప్రదర్శిస్తున్నాయి. ముంబైలోనూ ఇదే పరిస్థితి! దేవుడిని ఊరేగించినట్టు రోబో ప్రింట్లకు పూజలు జరిపి రథంలో థియేటర్ల వద్దకు తీసుకొస్తున్నారు. ముంబైలో ఉన్న రజనీ అభిమానులు చాలామంది తమ మిత్రులతో కలిసి రోబోను చూసేందుకు చెన్నైకి చేరుకుంటున్నారు.

    హైదరాబాద్‌లోని సగం థియేటర్లలో 'రోబో ' నే నడుస్తోంది. బుధవారం వరకూ టికెట్లు బుక్కయిపోయాయి కూడా! పీవీఆర్ వంటి కొన్ని పెద్ద పెద్ద థియేటర్లు కూడా ఉదయం ఎనిమిదింటి నుంచే సినిమా ఆటలు ప్రారంభిస్తున్నాయి. చిన్న చిన్న సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఓ డబ్బింగ్ సినిమా తెలుగు తెరపై ఈస్థాయిలో ఘన విజయం సాధించడం.. ఓపెనింగ్స్, కలెక్షన్స్ రావడం.. క్రేజ్ ఇదే తొలిసారి. మొత్తానికి రోబో చిత్రం మన భారతీయ చిత్ర ఘనతను ప్రదర్శించటంలో సఫలీకృతమైంది. రజనీ ది గ్రేట్ అనిపించుకున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X