»   » ఆ పాత్రనే చేయతగింది కాదు..అందుకే ప్లాఫ్ త్రిష

ఆ పాత్రనే చేయతగింది కాదు..అందుకే ప్లాఫ్ త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ తాను చేసిన కట్టా మీటా చిత్రం ఓ బేబీ స్టెప్ లాంటిదని,అది ప్లాప్ అయిందని బాలీవుడ్ ని ఈ సాకు చూపి వదిలే ప్రసక్తి లేదని అంది. అలాగే పెద్ద హీరో, డైరక్టర్ దొరికారు కానీ సరైన ప్యాకేజీ దొరకలేదని వాపోయింది. అలాగే కట్టామీటాలో తాను చేసిన మున్సిపల్ కమీషనల్ పాత్ర వయస్సు మరికాస్త పెద్ద వాళ్ళు చేస్తే బాగుండేదని అంది. అలాగే తన స్నేహితులంతా ఈ విషయమై కామెంట్ చేసారని వాపోయింది. ఇక ఫ్యాన్స్ అయితే నిజాయితీగా కమీషనర్ పాత్రలో చూడలేకపోయామని,నన్ను కాలేజీ అమ్మాయి పాత్రలోనే చూడగలమన్నారని త్రిష చెప్పింది. అసలు తనకు కూడా కమిషనర్ పాత్ర మరికాస్త మెచ్యార్ గా ఉంటే బావుండేదనిపించిందని చెప్పింది.

రీసెంట్ గా విడుదలైన తన తొలి బాలీవుడ్ చిత్రం కట్టా మీటా ప్లాప్ అయినా నా కెరీర్ కి ఏమీ నష్టం లేదు అంటోంది త్రిష. అందుకోసం తగిన ఏర్పాట్లే చేసుకున్నానని వివరిస్తోంది. ఇక త్రిష పని అయిపోయినట్లే బాలీవుడ్ లో మకాం ఎత్తోస్తోంది అని వినపడుతోన్న మాటలకు ఆమె ఘాటుగా సమాధానమిస్తోంది. పనిలేనివాళ్ళే తను బాలీవుడ్ వదిలేస్తందనే రాతలు రాస్తున్నారని ఆమె కయ్యమంది. అలాగే తాను కట్టా మీటా రిలీజ్ కు ముందే అక్షయ్ కుమార్ తో మరో రెండు చిత్రాలలో చేయటానికి కమిటయ్యానని వివరించింది. అంతేగాక త్రిషకు హిందీలో మరిన్ని అవకాశాలు వస్తున్నాయట.

తమిళంలో తాను శింబుతో నటించిన హిట్‌ చిత్రం విన్నైతాండి వరువాయా హిందీలో రీమేక్‌ కానుంది. తమిళంలో నటించిన పాత్రను హిందీలోనూ తానే పోషించనున్నానని త్రిష వెల్లడించారు. ప్రస్తుతం కమల్‌హాసన్‌ సరసన మన్మధన్‌ అంబు చిత్రంలో నటిస్తున్న త్రిష ఈ చిత్రం పూర్తయిన తరువాత హిందీలో అక్షయ్‌ కుమార్‌తో నటించే చిత్రంలో నటించనున్నారట. అందుకోసం ఆమె ముంబయిలో మకాం పెట్టాలని నిశ్చయిం చుకున్నారట. ఇందుకోసం ముంబయిలో ఇల్లును కూడా కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu