»   »  'బాహుబలి' తర్వాత :వర్జిన్ కుర్రాళ్ల శాపం తగులుతుందే(వీడియో)

'బాహుబలి' తర్వాత :వర్జిన్ కుర్రాళ్ల శాపం తగులుతుందే(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి అందించిన సూపర్ హిట్ 'బాహుబలి' ని తమిళంలో స్టూడియో గ్రీన్ వారు అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు ఓ చిన్న కామెడీ చిత్రంతో ముందుకు వస్తున్నారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజయ్యి ...హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వర్జిన్ కుర్రాళ్ల శాపం ఎవరికి తగులుతుంది అంటే ఈ క్రింద ట్రైలర్ చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

జీవీ ప్రకాష్‌కుమార్, ఆనంది, మనీషాయాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం త్రిష లేదా నయనతార. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకుడు. రుషి మీడియా నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జీవీ ప్రకాష్ మాట్లాడుతూ..... ఓ అమాయక యువకుడి జీవితంలోకి ప్రేమ పేరుతో ఒకేసారి ఇద్దరమ్మాయిలు ప్రవేశిస్తారు. వారిలో అతడు ఎవరి ప్రేమకు అంగీకారం తెలిపాడు? త్రిష లేదా నయనతారల్లాంటి అందమైన అమ్మాయిని ప్రేమించాలని తపించిన ఆ యువకుడి లక్ష్యం నెరవేరిందా? లేదా? అన్నదే ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు.

Trisha Ledha Nayanthara Official Teaser

దర్శకుడు మాట్లాడుతూ...పెండ్లికానీ యువకుడు తనకు త్రిష లేక నయనతార వంటి అందగత్తెలు కావాలని కోరుకుంటారు. ఆ క్రమంలో జరిగే కథాకమామిషే 'త్రిష లేదా నయనతార' అని చిత్ర దర్శకుడు ఆదిక్‌ రవిచంద్రన్‌ తెలియజేస్తున్నారు.

సంగీత దర్శకుడు జివి ప్రకాష్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా తమిళంలో నిర్మించారు. తెలుగులో కృష్ణ, రమేష్‌లు అనువదిస్తున్నారు. ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రాన్ని గురువారంనాడు ప్రసాద్‌ల్యాబ్‌లో ఆవిష్కరించారు.

చిత్ర దర్శకుడు మరిన్ని విశేషాలు తెలియజేస్తూ... అమాయకుడైన అబ్బాయి ఒకే సమయంలో ఇద్దరమ్మాయిల్ని ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనే చిత్రంలో పాయింట్‌. ప్రస్తుతం వున్న ట్రెండ్‌కు తగిన చిత్రమిది. సిమ్రాన్‌ ప్రాధాన్యతగల పాత్రను పోసించింది. హీరో ఆర్య, ప్రియా ఆనంద్‌ అతిథి పాత్రల్లో కన్పిస్తారు. ఆగస్టు మొదటివారంలో ఆడియోను, ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తామని' తెలిపారు.

జివి ప్రకాష్‌ మాట్లాడుతూ.. తమిళంలో 'డార్లింగ్‌' సినిమాతో నన్ను అరవింద్‌గారు హీరోగా పరిచయం చేశారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఇరవై ఏళ్ళ కుర్రాడు త్రిష లేదా నయనతారలాంటి అమ్మాయిల కోసం వెళుతూ ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతని లైఫ్‌ ఎలా వుందనేది వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కిం చారు. పాటలుకూడా ఎంటర్‌టైనింగ్‌ వుంటాయి. తమిళంలో ఆడియో పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో రామజోగయ్యశాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, రాఖీ సాహిత్యాన్ని అందించారు. త్వరలో దేవీశ్రీప్రసాద్‌ ఓ పాటనుకూడా పాడనున్నారని' చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ఇదొక మ్యూజికల్‌ థ్రిల్లర్‌ సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది పేర్కొన్నారు. 'బస్టాప్‌' ఫేమ్‌ రక్షిత, బెంగుళూరు మోడల్‌ మనీషా యాదవ్‌లు హీరోయిన్స్ లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జివి ప్రకాష్‌, కెమెరా: రిచ్డ్‌ ఎం నాధన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదిక్‌ రవిచంద్రన్‌.

English summary
Watch the first official teaser of Director Adhik Ravichandran’s Trisha Ledha Nayanthara starring G.V Prakash Kumar, Anandhi, produced by Cameo Films India
Please Wait while comments are loading...