Just In
Don't Miss!
- Sports
Syed Mushtaq Ali Trophy 2021: నాకౌట్ షెడ్యూల్ ఇదే
- Lifestyle
మీరు ఉదయాన్నే ఫోన్ చూస్తుంటారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే...
- News
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదం
- Finance
మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
- Automobiles
భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజువల్ గా బాగుంది... ( ‘తుంగభద్ర’ ట్రైలర్)
హైదరాబాద్ :ఆదిత్, డింపుల్ జంటగా వారాహి చలనచిత్రం పతాకంపై శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకత్వంలో సాయి కొర్రపాటి రూపొందిస్తున్న చిత్రం ‘తుంగభద్ర'. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరి ప్రశంసలూ పొందుతోంది. పల్లెటూరి నేపధ్యంలో పగలు, ప్రతీకారాలు మధ్య సాగే ప్రేమ కథగా ఈ చిత్రం ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మీరు ఓ లుక్కేయండి.
నిర్మాత మాట్లాడుతూ... గ్రామీణ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుందన్నారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకుణ్ణి ఆకట్టుకునేలా దర్శకుడు చిత్రీకరించారని, గతంలో తాను నిర్మించిన మూడు చిత్రాలు విజయవంతమయ్యాయన్నారు. అదేవిధంగా ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నానన్నారు.
‘ఈగ', ‘అందాల రాక్షసి', ‘లెజెండ్', ‘ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్య' చిత్రాలతో ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా నిరూపించుకున్నారు సాయి కొర్రపాటి. తాజాగా వారాహి చలన చిత్రం బ్యానర్ నుండి వస్తున్న చిత్రం ‘తుంగభద్ర'.

అదిత్ అరుణ్, డింపుల్ చోపడే జంటగా నటించిన ఈ చిత్రంలో తమిళ నటుడు సత్యరాజ్ సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు. శ్రీనివాస కృష్ణ గోగినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం. పల్లెటూరి రాజకీయాల నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చిత్ర బృందం నుండి వినిపిస్తున్న మాట.

కోట శ్రీనివాసరావు, సత్యరాజ్, చలపతిరావు, సప్తగిరి, కోట శంకర్‌రావు, పవిత్రా లోకేష్, రాజేశ్వరి నాయర్, ధన్‌రాజ్, నవీన్, రవివర్మ, జబర్దస్త్ శ్రీను, చరణ్, కల్పలత, శశాంక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:హరిగౌర, కెమెరా:రాహుల్ శ్రీవాత్సవ్, నిర్మాత:రజనీ కొర్రపాటి, రచన, దర్శకత్వం:శ్రీనివాసకృష్ణ గోగినేని.