ఉదయ్ కిరణ్ బయోపిక్‌‌లో ఇవి ఉంటాయా? తమ్ముడు గురించి, చిరంజీవి గురించి సోదరి శ్రీదేవి ఏమంది?

By Bojja Kumar

Recommended Video

Uday Kiran Sister Talks About Chiranjeevi Family

తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య పరిశ్రమలో ఓ సంచలనం. అప్పట్లో ఆయన మరణంపై అనేక పుకార్లు, అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే దేనికీ సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతోందని, దానికి తేజ దర్శకత్వం వహించబోతున్నారని వార్తలు తెరపైకి రావడంతో మరోసారి ఈ యంగ్ హీరో గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇప్పటి వరకైతే దర్శకుడు తేజ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించలేదు. అదే నిజమైతే ఉదయ్ కిరణ్ సోదరి చెప్పిన విషయాలు చూపిస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.

ఇన్నేళ్లయినా ఉదయ్ కిరణ్ ఇంకా తెలుగు వారి హృదయాల్లో

ఇన్నేళ్లయినా ఉదయ్ కిరణ్ ఇంకా తెలుగు వారి హృదయాల్లో

ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు నాలుగు సంవత్సరాలైనా ఇప్పటికీ ఎవరూ ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోను మరిచిపోలేదంటే తెలుగు ప్రేక్షకుల మదిలో ఉదయ్ కిరణ్ స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఉదయ్ బయోపిక్ అనేగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంంది.

ఉదయ్ మరణించిన సమయంలో చిరంజీవి గురించి కూడా...

ఉదయ్ మరణించిన సమయంలో చిరంజీవి గురించి కూడా...

ఉదయ్ కిరణ్ మరణించిన సమయంలో రకరకాల వార్తలు వినిపించాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, సినిమా అవకాశాలు లేక డిప్రెషన్ అని ఇలా చాలా వార్తలు వినిపించాయి. అప్పట్లో చిరంజీవి ఫ్యామిలీ పేరు కూడా ఇందులో తెరపైకి రావడంతో అంతా షాకయ్యారు. ఉదయ్ మరణించిన కొన్ని రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో అతడి సోదరి శ్రీదేవి(మస్కట్లో ఉంటారు) పలు విషయాలు పంచుకున్నారు. చిరంజీవి ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడారు.

తమ్ముడికి అలాంటి సమస్యలు లేవని చెప్పిన శ్రీదేవి

తమ్ముడికి అలాంటి సమస్యలు లేవని చెప్పిన శ్రీదేవి

ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి మాట్లాడుతూ తమ్ముడు మరణించే సమయంలో ఫైనాన్షియల్ సమస్యలున్నట్లు, పాల ప్యాకెట్లకు కూడా డబ్బు లేవు అనే వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అబద్దం. మియా పూర్, శంషాబాద్ ప్రాంతాల్లో మూడు ల్యాండ్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో గోల్డ్ ఉంది. మనీ లేక పోవడ కారణం కాదు, సినిమాల్లేక పోయినా జీవించే స్తోమత ఉంది తన తమ్ముడికి అని వెల్లడించారు.

కుటుంబంలో సమస్యల గురించి

కుటుంబంలో సమస్యల గురించి

అమ్మ చనిపోయాక నాన్నకు, తమకు మధ్య దూరం పెరిగిపోయింది. నాన్న వేరే అమ్మాయితో ఉంటటం తమ్ముడికి నచ్చలేదు. ఎవరైనా అమ్మ ప్లేసులో ఇంకొకరిని ఊహించుకోలేరు. నేను కూడా తమ్ముడి సైడే ఉండిపోయాను అని శ్రీదేవి తెలిపారు.

ఇష్టప్రకారమే పెళ్లి, కానీ వారి ప్రవర్తన విచిత్రంగా ఉండేది

ఇష్టప్రకారమే పెళ్లి, కానీ వారి ప్రవర్తన విచిత్రంగా ఉండేది

తమ్ముడు తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నాడు. అన్నవరంలో మేమే పెళ్లి పెద్దలుగా ఉదయ్-విషిత పెళ్లి జరిపించాము. మేము మస్కట్లో ఉంటాం. వాడి పెళ్లి తర్వాత 2013 జూన్ లో బంధువుల పెళ్లిలో ఆఖరుగా చూశాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. విషిత ఎప్పుడూ మాట్లాడేది కాదు. ఆమె గురించి అడిగితే బయటకు వెళ్లిందని చెప్పేవాడు. చాలా సంతోషంగా ఉన్నాననే చెప్పేవాడు. విషితను చాలా ప్రేమించాడు. హెవెన్ లో ఉన్నాననే చెప్పేవాడు. వారు సంతోషంగా లేరని ఆ సమయంలో ఎప్పుడూ డౌట్ కూడా రాలేదు అని శ్రీదేవి తెలిపారు.

తమ్ముడి మరణం తర్వాత విషిత కాంటాక్టులో లేదు

తమ్ముడి మరణం తర్వాత విషిత కాంటాక్టులో లేదు

తమ్ముడి మరణం తర్వాత విషిత మాతో టచ్‌లో లేకుండా పోయింది. ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఉదయ్ ప్రాపర్టీ అంతా తన చేతిలోనే ఉంది. ఉదయ్ ఉన్నపుడు భార్యతో సమస్య ఉందని కూడా చెప్పలేదు. బయట కూడా వారు హ్యాపీగా ఉన్నట్లే ఉంది. ఉదయ్ మరణం తర్వాత జరిగిన సంఘటనలు కొన్ని అనుమానం కలిగించాయి. కానీ నేను మస్కట్ లో ఉంటాను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసేది కాదు అని శ్రీదేవి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

అప్పటికే ఉదయ్ కిరణ్ ఫ్యామిలీలో ఆత్మహత్య

అప్పటికే ఉదయ్ కిరణ్ ఫ్యామిలీలో ఆత్మహత్య

ఉదయ్ కిరణ్ కంటే ముందు మా అన్నయ్య కూడా ఆత్మహత్య చేసున్నారు. హైలీ ఇంటలెక్చువల్. ఈ సమాజంలో జరిగే అన్యాయాలు ఆయనకు నచ్చేవి కాదు. తాను హిమాలయాస్ వెళతానని చెప్పేవాడు, చివరకు డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకున్నాడు అని శ్రీదేవి తెలిపారు.

ఉదయ్ వద్ద చాలా గోల్డ్ ఉండేది

ఉదయ్ వద్ద చాలా గోల్డ్ ఉండేది

అమ్మ ఉన్నపుడు ఆమె వద్ద నాలుగు కిలోల గోల్డ్, 80 నుండి 100 కిలోల సిల్వర్ ఉండేది. అదంతా ఉదయ్ దగ్గరే ఉండేది. ఉదయ్ ఉన్నపుడు నీ షేర్ తీసుకునే అంటే నేను మస్కట్లో ఉంటాను కాబట్టి నీ వద్దే ఉండనివ్వు అని చెప్పేదాన్ని, ఇపుడు అదంతా విషిత వద్దే ఉన్నాయి అని శ్రీదేవి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

 తమ్ముడికి చిరంజీవే ఇన్స్ స్పిరేషన్

తమ్ముడికి చిరంజీవే ఇన్స్ స్పిరేషన్

8 ఏళ్ల వయసులోనే నేను చిరంజీవి లాగా పెద్ద హీరో అవుతానని ఉదయ్ చెప్పేవాడు. ఎన్నో కలలతో సినిమా రంగంలోకి వచ్చి సక్సెస్ అయ్యాడు. తనకంటూ ఓ బాట వేసుకున్నాడు అని గురించి తమ్ముడి గురించి శ్రీదేవి వెల్లడించారు.

 చిరంజీవికి సంబంధం లేదు

చిరంజీవికి సంబంధం లేదు

ఉదయ్ ఆత్మహత్య తర్వాత చిరంజీవి పేరు వినిపించడం బాధేసిందని శ్రీదేవి స్పష్టం చేశారు. సుస్మితతో పెళ్లి రద్దు నిర్ణయం ఉదయ్ తీసుకున్నదే. సుస్మిత తనకు సరిపడదని అతడు భావించాడు, తనతో సర్దుకుపోగలనని అనుకోలేకపోయాడు. దాంతో పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది పూర్తిగా అతడి నిర్ణయమే. సుస్మితతో ఎంగేజ్మెంట్ జరగక ముందు నుంచే తమ్ముడికి చిరంజీవి ఎంతో సపోర్ట్ నిచ్చారు. అతడు కష్టకాలంలో ఉన్నప్పుడు (లేడీ జర్నలిస్ట్ తో బ్రేకప్ అయిన సమయంలో) ఎంతో అండగా నిలిచారు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికీ సిద్ధపడ్డారు అని శ్రీదేవి తెలిపారు. చిరంజీవి ఎంతో మంచి వ్యక్తి, ఆయన్ను బ్లేమ్ చేసే విధంగా మాట్లాడటం సరికాదు అని శ్రీదేవి తెలిపారు. చిరంజీవి కూతురుతో పెళ్లి రద్దు తర్వాత విషితను ఉదయ్ కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... అని శ్రీదేవి ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X