»   » ఉత్కంఠ.., ఆసక్తీ..., సంచలనం.... వంగవీటి ఆడియో ఫంక్షన్ హైలేట్స్ ఇవే (ఫొటోలు)

ఉత్కంఠ.., ఆసక్తీ..., సంచలనం.... వంగవీటి ఆడియో ఫంక్షన్ హైలేట్స్ ఇవే (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై చాలా ఆస‌క్తి పెరిగింది. రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసిన వంగ‌వీటి ట్రైల‌ర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వ‌చ్చాయి. అల్రెడి విడుద‌లైన పాట‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమా ఆడియో విడుల కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేసారు...

సాయంత్రం 5 గంట‌ల నుంచి ఆడియోటోరియం కిక్కిరిసిపోయేలా ప్లాన్‌ని డిజైన్ చేశారు. ఈ ఆడియో వేడుక‌కు వంగ‌వీటి రంగా అభిమానులు, కాపు సామాజిక వ‌ర్గం భారీ మొత్తంలో త‌ర‌లిరావటం కొంత ఆందోళనగా కనిపించినా తర్వాత సభ సాఫీగానే సాగింది. . అలాగే రంగా అనుచ‌రులు ఉన్న‌చోట దేవినేని గ్యాంగ్ కూడా ఉండ‌కుండా ఉంటుందా? ఈ ప్రెస్‌మీట్ పొలిటిక‌ల్ మిక్స్‌డ్‌గా ఉంటుందా?? అన్న ప్రశలతో అనుకున్న దానికంటే ఎక్కువే ఆసక్తి నెలకొంది. ఒక రాజకీయ సభ జరుగుతోందా అన్నంత గ్రాండ్ గా మొదలయ్యింది సభ.ఈ ఆడియో వేడుకకు సంబందించీన ఫొటోలూ ఇప్పుడు చూద్దాం...

 రామ్ గోపాల్ వర్మ:

రామ్ గోపాల్ వర్మ:


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో, దాసరి కిరణ్ నిర్మించిన చిత్రం వంగవీటి. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ విజయవాడలోని కెఎల్ యూనివర్శిటీలో జరిగింది. అయతే ఈ సందర్భంగా డైరెక్టెర్ వర్మ మాట్లాడుతున్న సమయంలో ఎదురుగా ఉన్న అభిమానుల నుంచి ‘వుయ్ వాంట్ రంగా డౌలాగ్స్' అంటూ అరుపులు వినిపించాయి. రంగా డైలాగ్స్ చెప్పాలని పట్టుబట్టారు.

 ఇరగ్గొడతా:

ఇరగ్గొడతా:


దీంతో నిర్మాత కిరణ్ మైక్ అందుకుని వర్మ మాట్లాడుతున్నారని కొద్దిసేపు సహకరించాలని కోరారు. అయితే ఆ తర్వాత మైక్ అందుకున్న వర్మ మాట్లాడుతూ.. అరవడం ఆపకపోతే ఇరగ్గొడతానని సరదాగా వ్యాఖ్యానించారు. రంగా డైలాగ్స్ మూవీలో వింటారని చెప్ప ప్రసంగం కొనసాగించారు.

 డైరెక్టర్ అవ్వకముందు నుంచీ:

డైరెక్టర్ అవ్వకముందు నుంచీ:


వర్మ మాట్లాడుతూ.. తన జీవిత, సినీ అనుభవం మొత్తం విజయవాడ నుంచే ప్రారంభమైందని.. ఇంజనీరింగ్ చేయడానికి కాలేజీకి వచ్చాను కానీ నేర్చుకున్నది మాత్రం ఇక్కడి వాతావరణాన్ని అని చెప్పారు. డైరెక్టర్ అవ్వకముందు నుంచీ ఈ సినిమా తీయాలని అనుకున్నానని.. అప్పట్లో చోటుచేసుకున్న చాలా సంఘటనలు ఈ సినిమాలో ఉన్నాయని అన్నారు. అప్పట్లో తాను కూడా ఒక గ్యాంగ్ లో ఉన్నానని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

 కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్:

కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్:


ఈ సినిమాలో కేవలం నా అనుభవాలు మాత్రమే కాదు, స్టోరీలో పట్టు ఉండడం కూడా నేనీ సినిమా తీసేందుకు కారణమైంది. ఈ సబ్జెక్ట్ తో నాకున్న ఎమోషనల్ బాండింగ్ మరేసినిమాకి లేదు.. సినిమా ఎలా వచ్చిందన్నది సినిమా రిలీజైన తరువాత అంతా చూస్తారు.. 'వంగవీటి' అనేది నా కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంది.

 ప్రమాదం ఉందని తెలిసి:

ప్రమాదం ఉందని తెలిసి:


ఈ కథ పట్ల ఒక్కొక్కరి అవగాహన ఒక్కోలా ఉంటుంది.. నాకున్న అవగాహనతోనే నేనీ సినిమా తీశాను. వివాదాస్పద అంశాలతో రూపొందే సినిమా అని తెలిసినా.. ఏమాత్రం బ్యాలెన్స్ చేయకపోయినా ప్రమాదం ఉందని తెలిసినా.. నిర్మాత దాసరి కిరణ్ వెనకడుగు వేయకపోవడం విశేషం అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు వర్మ.

 రామదూత‌ క్రియేష‌న్స్:

రామదూత‌ క్రియేష‌న్స్:


విజ‌య‌వాడ న‌గ‌రంలో ఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాన‌ని అనౌన్స్ చేయ‌గానే దానిపై చాలా ఆస‌క్తి పెరిగింది. రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుంచి ప్రేక్ష‌కుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.

 రాధా ఫైర్ఈ:

రాధా ఫైర్ఈ:


సినిమాని వాస్తవాలకు దూరంగా చిత్రీకరిస్తున్నాడని వర్మపై రంగ తనయుడు రాధా ఫైర్ అవ్వడంతో పాటు కోర్టుని ఆశ్రయించడంతో ఇందులోని ‘కాపు కమ్మ' పాటను చిత్రం నుండి తొలిగిస్తున్నట్లు రాంగోపాల్ వర్మ హామీ ఇచ్చారు. అయినప్పటికీ శనివారం సాయంత్రం వంగవీటి సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతుందా లేదా అని అనేక సందేహాలు వచ్చాయి.

 రాధాతో చర్చలు:

రాధాతో చర్చలు:


ఉదయం నుండి రాంగోపాల్ వర్మ తన సన్నిహితులతో పలు దఫాలుగా వంగవీటి రాధాతో చర్చలు జరిపారు. చివరికి యధావిధిగా వంగవీటి ఆడియోను అభిమానుల మధ్య విడుదల చేశాడు.అయితే కెఎల్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో వంగవీటి ఆడియో ఫంక్షన్ ప్రారంభమైన దగ్గర నుండి టెన్షన్‌పూరిత వాతావరణం నెలకొంది. రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతోపాటు నినాదాలు చేస్తూ గ్రౌండ్‌ని హోరెత్తించారు.

 మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ప్ర:

మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ప్ర:


ముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ వంగవీటి చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో వర్మ మాట్లాడుతూ.. నా కెరియర్‌లోనే ఈ చిత్రం గొప్పచిత్రమే అని నేను చెప్పలేను ఎందుకంటే నేనే దర్శకుడిని కాబట్టి చిత్రం చూశాక మీరే చెప్తారు ఏది నిజమో ఏది అబద్దమో అంటూ ..

 జైరంగ' అనే నినాదాలు:

జైరంగ' అనే నినాదాలు:


తొలగించిన కాపు కమ్మ పాటను పాడి తన స్పీచ్‌ని ముగించారు వర్మ. వర్మ మాట్లాడుతున్నంతసేపు రంగ అభిమానులు ‘జైరంగ' అనే నినాదాలు చేస్తూ కాసేపు అడ్డుతగలడంతో వర్మ తొందరగా తన ప్రసంగాన్ని ముగించారు. రంగా అనుచ‌రులు ఉన్న‌చోట దేవినేని గ్యాంగ్ కూడా ఉండ‌కుండా ఉంటుందా? ఈ ప్రెస్‌మీట్ పొలిటిక‌ల్ మిక్స్‌డ్‌గా ఉంటుందా?? అన్న ప్రశలతో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన ఈ ప్రసంగం ముగియటన్ తో కాస్త తగ్గింది.

సందడి చేశారు:

సందడి చేశారు:

ఈ ఆడియోకి ఊహించని విధంగా ఆడియెన్స్ రావడం విశేషం. ఓ పెద్ద హీరో సినిమా ఆడియోకు వచ్చినంతగా వంగవీటి ఆడియోకి వచ్చారు. ఈ క్రమంలో ఫంక్షన్ ఏదైనా పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఉంది తీరాల్సిందే. నిన్న జరిగిన వంగవీటి ఆడియోలో కూడా పవర్ స్టార్ అభిమానులు సందడి చేశారు.

 భజన ఎక్కువైంది:

భజన ఎక్కువైంది:


ఈవెంట్ జరుగుతున్న సమయంలో స్టేజ్ కు దగ్గరగా పవర్ స్టార్ అంటూ కేకలు వేయడం ఝాన్సి వారికి సర్ధి చెప్పడం జరిగింది. అంతేకాదు వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ మాటల సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తలచుకుని ఆడియో వేడుకకు ఇంకాస్త వేడి తెచ్చిపెట్టారు. వంగవీటి నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోశియేషన్ లో పనిచేయడం జరిగింది అందుకే వంగవీటి ఆడియోలో పవర్ స్టార్ భజన ఎక్కువైంది.

పవర్ స్టార్ ఫ్యాన్స్:

పవర్ స్టార్ ఫ్యాన్స్:


వచ్చిన గెస్ట్ లు పవర్ స్టార్ గురించి మాట్లాడుతుంటే ఒక్క సారిగా ఫ్యాన్స్ అంతా కేకలు వేయడం మొదలు పెట్టారు. కొందరు ఆకతాయి ఫ్యాన్స్ మొదట్లో కాస్త ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత సర్ధుమనిగారు. సో మొత్తానికి వంగవీటి ఆడియోలో కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా అలా షురూ అయ్యిందన్నమాట.

అస‌లు వెన‌క్కి తెగ్గ‌ను:

అస‌లు వెన‌క్కి తెగ్గ‌ను:


వంగ‌వీటి లో కాపు, క‌మ్మ అంటూ సాగే వివాదాస్ప‌ద పాట‌ను కోర్టు ఆదేశాల మేర‌కు వ‌ర్మ అండ్ గ్యాంగ్ తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. అస‌లు వెన‌క్కి తెగ్గ‌ను.. వెన్ను వంచ‌ను అని చెప్పే వ‌ర్మ బెట్టు వీడి వెన‌క్కి త‌గ్గాడు. కోర్టు ఆర్డ‌ర్‌ని గౌర‌వించాడు. అయితే ముందునుంచే తనదైన శైలిలో ఏదో జరగ బోతోందీ అన్న ఫీల్ ని తన ట్వీట్లతో క్రియేట్ చేసాడు వర్మ...

ఇబ్బంది పెడుతున్నారు:

ఇబ్బంది పెడుతున్నారు:

‘ఇప్పుడే రాధ, అతని తల్లిని కలిశాను. ఈ భేటీ అంత సాఫీగా సాగలేదు.. సమస్యలు.. నేను రాజీపడేది లేదు. ఏమౌతుందో చూద్దాం'‘నేను చాలా సీరియస్‌ వార్నింగ్‌లను చూశా. కానీ తొలిసారి నవ్వుతూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన వారిని చూశా. ప్రమాదకరం.. కానీ ‘వంగవీటి'పై నా దృక్పథం విషయంలో రాజీపడను'. ‘ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు.. కానీ చాలామంది రాధా- రంగా మిత్రమండలి కార్యకర్తలు మాకు అండగా ఉన్నారు. వారిని నేను ఆడియో వేడుకకు ఆహ్వానించాను' అని వర్మ వరుస ట్వీట్లు చేశాడు...

English summary
Highlites of "vangaveeti Movie As the story is based on the lives of Vangaveeti Mohana Ranga, and his brother Vangaveeti Radha Krishna Rao and their altercation with communist dominated Vijayawada of the 1980’s Andhra Pradesh audio launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu