»   »  వర్మ చూపే 'వంగవీటి రత్నకుమారి' ఈమే (ఫొటోలు)

వర్మ చూపే 'వంగవీటి రత్నకుమారి' ఈమే (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'వంగవీటి' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ నిమిత్తం విజయవాడ టూర్ లు వేస్తున్న ఆయన అందులో ప్రధాన పాత్రలు ఎంపిక కూడా చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన సినిమా లో కీ రోల్ అయిన కాపు లీడర్ వంగవీటి మోహన్ రంగా పాత్రకు క్యారక్టర్ ని ఎంపిక చేసి ప్రకటించారు.

ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా భార్య పాత్ర కోసం ఓ బెంగాళి నటిని ఎంపిక చేసి, ఫొటోలు విడుదల చేసారు. ఆ ఫొటోలు మీరు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు. చిత్ర కథలో వంగవీట రత్నకుమారి పాత్రకు కూడా పూర్తి స్ధాయి ప్రాధాన్యత ఉంది. ఈ విషయమై వర్మ ఏమన్నారో చూడండి.

"వంగవీటి రంగాగారిని చంపిన తర్వాతే, వంగవీటి రత్నకుమారిగారు వెలుగులోకి వచ్చారు...కానీ ఆ హత్య జరగక ముందు నాకు తెలిసిన రత్నకుమారిగారి జీవితంలో ఆవిడ అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం నేను చాలా చాలా చాలా అన్వేషించాను.

చివరికి ఆ కెపాసిటీ నాకు కనిపించింది నూతన నటి నైనా గంగూలిలో...హీరోయిన్ ల బట్టలిప్పాలనే మనస్తత్వమున్న వ్యక్తుల బట్టలు కూడా కేవలం తమ కళ్ళలోని తీక్షణతో విప్పగలిగే స్మితా పాటిల్ కెపాసిటీ ఉన్న మహా సీరియస్ నటి నైనా గంగూలి అంటున్నారు" రామ్ గోపాల్ వర్మ

స్లైడ్ షోలో వంగవీటి రత్న కుమారి పాత్రధారణి ఫొటోలు

ఎప్పటిలాగే

ఎప్పటిలాగే

రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే ఈమెను స్మితాపాటిల్ తో పోల్చి హైప్ ఇచ్చే ప్రయత్నం చేసారు.

స్క్రీన్ ప్లే ప్రధానం

స్క్రీన్ ప్లే ప్రధానం

చిత్రం కథ కన్నా కథనంతో నడుస్తోందని తెలుస్తోంది.

ముంబై లో

ముంబై లో

ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం ముంబై లో జరుగనుంది.

వివాదాలు

వివాదాలు

ఈ చిత్రం చేయరాదంటూ వివాదాలు రేగినా ఆపనంటున్నారు వర్మ.

కులాల మధ్యే

కులాల మధ్యే

ఈ చిత్రం పూర్తిగా కలాల మధ్య జరిగే కథగా ఉంటుందని, మళ్లీ కులాల చిచ్చు రేపుతుందని అంటున్నారు.

వంగవీటి రాధ

వంగవీటి రాధ

వర్మ చూపించబోయే వంగవీటి రాధ ఈయనే

లోగో

లోగో

రీసెంట్ గా ఈ చిత్రం లోగోను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు

రంగా

రంగా

వర్మ చూపించబోయే వంగవీటి రంగా ఈయనే

 సినిమాటిక్

సినిమాటిక్

నిజానికి పరిటాల కంటే వంగవీటి రంగాది మరింత సినిమాటిక్ జీవిత కథ.

చిక్కు ముడులు

చిక్కు ముడులు

మరి రంగా చరిత్ర సినిమాగా ఇంతకాలం ఎండుకు రాలేదు? అందుకు సామాజిక వర్గాలకు సంబంధించిన అనేక చిక్కుముడులు ఉన్నాయి.

పాత్ర కొంత

పాత్ర కొంత

కమ్మ- కాపు లీడర్ల మధ్య, గ్రూపుల మధ్య విజయవాడ చరిత్ర నడిచింది. మధ్యలో కమ్యూనిస్టుల పాత్ర కొంత ఉంటుంది.

 హత్యతో మొదలై హత్యతో ముగుస్తుంది

హత్యతో మొదలై హత్యతో ముగుస్తుంది

రంగా సోదరుడు రాధాకృష్ణ హత్యతో ఈ కథ ప్రారంభమై రంగా హత్యతో ముగుస్తుందని వర్మ తెలిపారు.

రీసెర్చ్ కోసం

రీసెర్చ్ కోసం

రీసెంట్ గా వర్మ ..కథా రీసెర్చ్ కోసం అంటూ విజయవాడ వెళ్లారు

నెహ్రూని..

నెహ్రూని..

విజయవాడలో వర్మ దేవినేని నెహ్రూని కలిసి మాట్లాడారు.

ఫ్లెక్సీలతో

ఫ్లెక్సీలతో

విజయవాడలో వర్మకు ఎన్నడూ లేని విధంగా ప్లెక్సీలతో స్వాగతం పలికారు

English summary
Now RGV has selected Naina Ganguly to portray the character of Vangaveeti Ratna Kumari, Ranga’s wife.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu