»   » అక్కినేనిపై వాణిశ్రీ సంచలన వ్యాఖ్యలు

అక్కినేనిపై వాణిశ్రీ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vanisri
అలనాటి ప్రముఖ నటి వాణిశ్రీ అక్కినేని నాగేశ్వరావు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశదాసు చిత్రంలో సావిత్రి నటించక పోతే, ప్రేమ్ నగర్ నేను నటించకపోతే...అక్కినేని నాగేశ్వర రావు, నిర్మాత రామానాయుడులు ఎక్కడ ఉండేవారని ఆమె ప్రశ్నించారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, మహానటి సావిత్రి సాహిత్య సాంస్కృతిక కళా పీఠం విజయవాడలో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని వాణిశ్రీ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

ఐదేళ్లు పదవిలో ఉండే రాజకీయ నాయకుల్నే ఎవరూ గుర్తుంచుకోరని, అలాంటిది ఒక సినీ నటిని గుర్తు పెట్టుకుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చిత్ర పరిశ్రమ ప్రత్యేకత అన్నారు. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో పద్మశ్రీలు, పద్మ భూషణ్ అవార్డులను కొనుక్కుంటున్నారని, అలా కొనుక్కోక పోవడం వల్లనే సావిత్రి, ఎస్వీ రంగారావు లాంటి వారికి ఆ అవార్డులు రాలేదని ఆమె వ్యాఖ్యానించారు.

English summary
Vanisri said that if savithri does not exist, akkineni Nageswararao may not reach this position
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu