»   »  పవన్ "జల్సా" వినూత్న పబ్లిసిటీ

పవన్ "జల్సా" వినూత్న పబ్లిసిటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pavan Kalyan
పవన్ కళ్యాణ్ తాజా సినిమా "జల్సా" ఈనెల 27 న విడుదల కానుంది. ఈ సిన్మా పబ్లిసిటీ వినూత్న రీతిలో సాగుతోంది. ఈ చిత్ర నిర్మాణ సంస్ధ ఏడున్నర అడుగుల పవన్ కళ్యాణ్ స్టాండీలను వెయ్యివరకు తయారు చేయించి, మాల్స్, క్రాస్ రోడ్స్, మల్టిప్లెక్స్ తదితర జన సమ్మర్దం గల ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోంది. స్టాండీల ద్వారా పబ్లిసిటీ చేయడం హాలివుడ్, బాలీవుడ్ లలో ఉంది కానీ తెలుగులో ఇదే ప్రధమం.

త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఇలియానా, పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ నటించారు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X