Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజేతగా వరుణ్ సందేశ్?
బైక్, కుర్రాడు వంటి టైటిల్స్ అనుకున్న తర్వాత వరుణ్ సందేశ్ చిత్రానికి విజేత అనే టైటిల్ కన్ఫర్మ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గుణ్ణం గంగరాజు కుమారుడు గుణ్ణం సందీప్ దర్శకుడుగా పరిచయమవుతూ చేస్తున్న పొల్లాదవాన్ రీమేక్ చిత్రానికి ఈ టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. అమ్మ చెప్పింది చిత్రంతో కెమెరామెన్ గా పరిచయమైన గుణ్ణ సందీప్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో మెగా ఫోన్ పట్టుకున్నాడు. కొద్దిగా ప్యాచ్ వర్క్ మినహా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రంలో వరుణ్ సరసన నేహా శర్మ నటిస్తోంది. చిరుత చిత్రం తర్వాత ఆమె చేస్తున్న చిత్రం ఇదే.
ఇక ఈ సినిమాలో కథ ప్రభు అనే ఓ తెలివైన బద్దకస్దుడైన కుర్రాడు చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడూ స్నేహితులతో తిరిగే అతనికి ఓ బైక్ కొనుక్కోవాలనే తీరని కోరిక ఉంటుంది. అయితే నిజాయితీ పరుడైన తండ్రి సంపాదన ఆ అవకాశమివ్వదు. అయితే అతను ఓ రోజు తండ్రితో డబ్బుకోసం గొడవపడి యాభై వేలు సాధిస్తాడు. దాంతో బైక్ కొనుక్కుని..వెంటనే బ్యాంక్ జాబ్ సంపాదించి...బస్టాప్ లో పరిచయమైన పిల్లతో ప్రేమలో పడతాడు. అంతా సెటిల్ అయిందనుకున్న సమయంలో అతని బైక్ దొంగతనం జరుగుతుంది. అతని జాబ్ పోతుంది. అతని గర్ల్ ప్రెండ్ ఛీ కొడుతుంది. అక్కడనుండి అతను ఆ బైక్ ని పట్టుకునే ప్రయాణంలో ఓ డాన్ తో తలపడాల్సి వస్తుంది.
అక్కడ నుండి కథ డార్క్ సైడ్ కి వెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ చిత్రం టెక్నికల్ గా సౌండ్ గా ఉంటుంది. ఇక ధనుష్ నటన చెప్పేదేముంది. వరుణ్ సంధేశ్ ఈ సినిమా కాన్సెప్టుని ఆకలింపు చేసుకుని నటించాడు అంటున్నారు. ఇక 'కొత్త బంగారులోకం' చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే వరుణ్ ఎవియం వారి ఎవరైనా..ఎపుడైనా చిత్రంలోనూ హీరోగా చేస్తున్నాడు.ఇక విజేత టైటిల్ గతంలో చిరంజీవి తో చేసారు. అలాగే ఆ మధ్య భరత్ హీరోగా డబ్బింగ్ అయిన ఓ చిత్రానికి కూడా పెట్టారు.