»   » వరుణ్‌ సందేశ్‌ కోలుకుని ... నిశ్చితార్దం (ఫొటో)

వరుణ్‌ సందేశ్‌ కోలుకుని ... నిశ్చితార్దం (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరో వరుణ్‌ సందేశ్‌ టైఫాయిడ్‌, డెంగీ జ్వరాల నుంచి కోలుకున్నాడు. ఇటీవల ప్రకటించినట్లుగా నేడు వితికతో ఆయన నిశ్చితార్థానికి సర్వం సిద్ధమైంది. ఇటీవలే వీరిద్దరూ తమ నిశ్చితార్థం గురించి అభిమానులకి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

Thank u so much for all your wishes and it's a time for BIG DAY... My engagement with Varun Sandesh U can find out more...

Posted by Vithika Sheru on 6 December 2015

గత నెల 30న వితిక తన కాబోయే భర్త టైఫాయిడ్‌, డెంగీతో బాధపడుతున్నాడని.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అభిమానులకి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం వరుణ్‌ సందేశ్‌ కోలుకున్నాడని.. ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.
Varun Sandesh engaged with Vithika Sheru

అయితేతర్వాత వరుణ్ మీడియా ముందుకు వచ్చి.... తాను కేవలం జనరల్ చెకప్ కోసమే మంగళవారం యశోదా ఆస్పత్రికి వెళ్లానని, అక్కడ తనను చూసిన కొందరు ఈ విధంగా రూమర్స్ క్రియేట్ చేశారని వరుణ్ వాపోయాడు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, త్వరలోనే తన ప్రియురాలు వితికతో నిశ్చితార్ధం జరగబోతోందని చెప్పాడు .

English summary
Varun Sandesh engaged today. HappyDays God Bless!!!
Please Wait while comments are loading...