»   » పుస్తకం రాస్తున్నా, అందరి చరిత్రలు బయట పెడతా : దాసరి

పుస్తకం రాస్తున్నా, అందరి చరిత్రలు బయట పెడతా : దాసరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పసుపులేటి రామారావు రచించిన 'వెండితెర అరుణ కిరణం టి.కృష్ణ' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శక రత్న దాసరి నారాయణ రావు.... పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని టి.కృష్ణ కుమారుడు, నటుడు గోపిచంద్‌కు అందించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ టి.కృష్ణ సినిమాలు సినీచరిత్రలో నిలిచిపోతాయన్నారు.

పుస్తకం రాస్తున్నా: దాసరి

పుస్తకం రాస్తున్నా: దాసరి

తాను మూడున్న‌రేళ్లుగా ఓ పుస్తకం రాస్తున్నా.. మరో ఏడాదిలో అది అందుబాటులోకి వస్తుంది. ఆ పుస్తకంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అందరి చరిత్రలు ఉంటాయని దాసరి నారాయణ రావు ఈ సందర్భంగా తెలిపారు.

టి. కృష్ణ

టి. కృష్ణ

తొట్టెంపూడి కృష్ణ(టి. కృష్ణ) ప్రముఖ తెలుగు చలనచిత్ర ఎడిటర్ మరియు దర్శకుడు. ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం లాంటి విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు.

నిర్మాతగా కూడా

నిర్మాతగా కూడా

ఈ తరం పిక్చర్స్ సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ప్రముఖ తెలుగు నటుడు తొట్టెంపూడి గోపీచంద్ ఈయన కుమారుడే. టికృష్ణ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మే 8, 1987 న మరణించాడు.

టి కృష్ణ సినిమాలు

టి కృష్ణ సినిమాలు

నేటి భారతం (1980) (కథ, దర్శకత్వం)
ఇంద్రుడు చంద్రుడు (1981) (దర్శకత్వం)
దేశంలో దొంగలు పడ్డారు (1985) (కథ, దర్శకత్వం)
దేవాలయం (సినిమా) (1985) (కథ, కథనం, దర్శకత్వం)
వందేమాతరం (1985 సినిమా) (1985) (కథ, కథనం, దర్శకత్వం)
ప్రతిఘటన (1985) (కథ, కథనం, దర్శకత్వం)
పకరాతిను పకరం (1986) (దర్శకత్వం) [మలయాళం]
ప్రతిఘట్ (1987) (కథ, కథనం)
రేపటి పౌరులు (1986) (రచన, దర్శకత్వం)

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో

ఈ కార్యక్రమంలో ‘మా' అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, సినీ ప్రముఖులు ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు, సుమన్‌ మాదాల రవి, బి.గోపాల్‌, భీమనేని శ్రీనివాసరావు, ముత్యాల సుబ్బయ్య, పోకూరి బాబురావు, ఆర్‌.నారాయణమూర్తి, ఎ.ఎం.రత్నం తదితరులు పాల్గొన్నారు.

English summary
Venditera Aruna Kiranam T Krishna Book Launch held at Hyderabad. Gopichand, Dasari Narayana Rao, Rajendra Prasad, B Gopal, AM Rathnam, Kota Srinivasa Rao, Suman, BVSN Prasad graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu