twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భం: ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి

    By Bojja Kumar
    |

    Recommended Video

    ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవంలో బాలయ్య పవర్‌ఫుల్ స్పీచ్

    మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ ప్రారంభోత్సవం గురువారం ఉదయం నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    తెలుగువారు గర్వించే వ్యక్తి రామారావు

    తెలుగువారు గర్వించే వ్యక్తి రామారావు

    ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, చరిత్రలో నిలిచిపోయే సందర్భం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పరుగాంచి తెలుగుదనానికి నిండుతనాన్ని తీసుకొచ్చి, తెలుగు తేజాన్ని ప్రపంచం అంతా చాటి చెప్పి, తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి, తెలుగు పౌరుషాన్ని దేశ రాజకీయ ముఖ చిత్రంలో వెలిగించి, తాను ఒక వెలుగు వెలిగి, ఆ వెలుగు ద్వారా ప్రజలకు అనేక రకాల సందేశాలు, మేలు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా ప్రారంభం అయిన రోజు, అందుకే ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు అన్నారు.

    ఆయనపై అభిమానంతో వచ్చాను

    ఆయనపై అభిమానంతో వచ్చాను

    సాధారణంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఇలాంటి కార్యక్రమాలకు రారు. ఎన్టీఆర్‌ మీద నాకున్న వ్యక్తిగత అభిమానం, స్నేహం ఉంది. అందుకే వచ్చాను. ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయాయి. రామారావు అభిమాని కానివారు సినీరంగంలో లేరంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన లవకుశ, పాతాళభైరవి, దేశోద్ధారకుడు చిత్రాలు మార్చి 29నే రిలీజ్‌ అయ్యాయి. అదేరోజు ప్రారంభమవుతున్న ‘ఎన్టీఆర్‌' చిత్రం విజయం సాధించాలి అని వెంకయ్య నాయుడు అన్నారు.

    రామారావు చరిత్ర ఇప్పటి తరానికి తెలియాలి

    రామారావు చరిత్ర ఇప్పటి తరానికి తెలియాలి

    సినిమా అనేది ఒక శక్తివంతమైన సాధనం. అది మనుషులను ప్రభావితం చేస్తుంది. రామారావు లాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర నవతరాలకు తెలియాలి. ఓ మహానుబావుడి చరిత్రను రాయడం, సినిమాగా తీయడం చాలా అవసరం. ఈ ప్రయత్నాన్ని బాలకృష్ణ చేపట్టడం అభినందనీయం. తన తండ్రి పాత్రను కుమారుడు పోషించడం దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి దారితీస్తుంది. ‘ఎన్టీఆర్‌' చిత్ర ప్రారంభం వేడుకలో పాల్గొనడం నా అదృష్టం. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారు అని వెంకయ్య అన్నారు.

    ప్రజల జీవితాలపై తనదైన ముద్ర వేశారు

    ప్రజల జీవితాలపై తనదైన ముద్ర వేశారు

    చాలా మంది మనలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో చూడలేదు. ఆయన ఆయా పాత్రల్లో నటించి ప్రజల జీవితాలపై తనదైన ముద్ర వేశారు. తెలుగు జాతి ఉన్నంత కాలం వారిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు వాడిని అని విధంగా గర్వించే విధంగా మన వ్యక్తిగతంగా కూడా ప్రవర్తించాలి.

    English summary
    Here is Sri M. Venkaiah Naidu garu Dynamic Speech at #NTRBiopic Movie Launch Event. #NTRBiopic, is launching on 29 March 2018, at Ramakrishna Studios, Hyderabad, by the Honorable Vice President of India, Sri M. Venkaiah Naidu garu, as the Chief Guest. The legendary life of Nandamuri Taraka Rama Rao, famously known as NTR, is now being made into a bio-pic, by Director Teja on the Banner of Vaaraahi Chalana Chitram .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X