»   » అప్పటివరకే 'చంద్రముఖి' ప్రభావం ఉంటుంది: వెంకటేష్

అప్పటివరకే 'చంద్రముఖి' ప్రభావం ఉంటుంది: వెంకటేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేక్షకులు థియేటర్ ‌లోకి అడుగుపెట్టేంత వరకే 'చంద్రముఖి' ప్రభావం ఉంటుంది. 'నాగవల్లి'లో తొలి సన్నివేశం చూస్తే మీకేం గుర్తుకురావు. ప్రారంభం అంత గొప్పగా ఉంటుంది. ఆ బిగి చివరి వరకూ అలాగే కొనసాగుతుంది. ఇక రజనీకాంత్‌ అంటారా..? ఆయనో సూపర్ ‌స్టార్‌. నన్ను ఆయనతో పోల్చుకోవడం మంచిదేగా అంటున్నారు వెంకటేష్. అలాగే రీమేక్‌ సినిమాల్లో ఉండే ఇబ్బంది ఇదే. దీన్ని నేను ముందే గ్రహించాను అన్నారు. అలాగే మా అబ్బాయి కూడా 'డాడీ..ఔర..ఔర' అంటున్నాడు. దాన్ని బట్టి ఈ పిలుపు జనంలోకి ఎంతగా వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. 'నాగవల్లి' అనే సినిమా మీద ఆసక్తి పెరగడానికి ఆ సౌండింగ్‌ కూడా ఓ కారణమే అన్నారు. డిసెంబరు 16న 'నాగవల్లి' చిత్రం విడుదల అవుతోంది. ఇక ప్రముఖ దర్శకుడు పి.వాసు రూపొందించిన కన్నడ 'ఆప్తరక్షక' కు తెలుగు రీమేక్ 'నాగవల్లి'.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu