»   » ఈ రోజు మన సినిమావాళ్లందరూ ఈ థియోటర్ లోనే

ఈ రోజు మన సినిమావాళ్లందరూ ఈ థియోటర్ లోనే

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : వేరే ఇతర భాషల్లో ఏదైనా ఆసక్తికరమైన సినిమా వస్తోందంటే..దాని రిజల్ట్ కోసం సినిమావాళ్లు ప్రతీ శుక్రవారం ఆసక్తిగా చూస్తూంటారు. చాలా మంది థియోటర్స్ కు వెళ్లి తాము ఎదురుచూస్తున్న సినిమాని చూసేసి, బాగుంటే రీమేక్ రైట్స్ కు అటు నుంచి అటే చెన్నై లేదా ముంబై ప్రయాణం కట్టేస్తారు. అలా మనవాళ్లలో ఆసక్తి రేపిన ఓ చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. అది మరేదో కాదు 'బాబి జాసూస్‌'. సినిమా రిజల్ట్ బాగుంటే రైట్స్ తీసుకుందామని చాలా మంది తెలుగు నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  ఈ సినిమా విషయానికి వస్తే...సాధారణంగా 'బాబి జాసూస్‌' సినిమాలో విద్యా బాలన్ ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 12 రకాల మారువేషాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె ఓ డిటెక్టివ్‌. గూఢచారి అంటే ఇతరులు గుర్తు పట్టకుండా పని కానివ్వాలి కదా? అందుకన్నమాట. సమర్‌ షేక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి దియా మీర్జా, సాహిల్‌ సంఘా నిర్మాతలు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి కథేంటో.. దాని వెనుక కసరత్తేంటో ఓ సారి చూద్దామా!

  Vidya Balan's 'Bobby Jasoos' today release

  ఈ చిత్రం కథ విషయానికి వస్తే... బిల్కిస్‌ అహ్మద్‌ అలియాస్‌ బాబి. ఉండేది హైదరాబాద్‌లోని మొఘల్‌పురా. నగరంలోనే పేద్ద గూఢచారి కావాలనేది ఆశయం. దీని కోసం ఆమె చాలా ప్రయత్నాలే చేసింది. ప్రతి దగ్గర ఒక్కటే వ్యంగ్యం. 'సినిమాలు చూసేసి గూఢచారులు అవ్వాలని వచ్చేస్తారు..' అని. దాంతో ఆమెకామే సొంతంగా 'బాబి జాసూస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' సంస్థ పెట్టేసుకుంది. సరైన ఆఫీస్‌ కూడా ఉండదు. ఓ కేఫ్‌లోనే కార్యకలాపాలు. ఇక ఆమె దగ్గరకు వచ్చే కేసులు వింటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. ఈ సమయంలో ఆమెకు అనుకోకుండా ఓ పెద్దాయన వచ్చి ఓ కేస్‌ అప్పగిస్తాడు. దీని కోసం భారీ మొత్తంలో డబ్బు కూడా ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.

  ఈ సినిమాలో విద్యాబాలన్‌ షేక్‌, ముస్లిం యువతి, జ్యోతిష్కుడు, ప్యూన్‌, మార్వాడీ మహిళ.. ఇలా 12 రకాల వేషాలు వేసింది. మరి వీటి కోసం ఎన్ని లుక్స్‌ సిద్ధం చేశారో తెలుసా?- 122. వీటిలో ఏవి బాగుంటాయో చూడటానికి విద్య రెండు వారాల సమయం కేటాయించింది. రోజూ ఎనిమిది నుంచి పది వరకు వేషాలు ఎంచుకొని ఆ దుస్తులు, అలంకరణతో సిద్ధమయ్యేది. నిర్మాత దియా మీర్జా చెబుతూ ''విద్య చాలా ఓపిగ్గా 122 గెటప్‌లు వేసుకుంది. మా డిజైనర్‌ తేయా టెక్‌చందనే చాలా కష్టపడి వీటిని సిద్ధం చేసింది'' అని చెప్పింది.

  విద్యాబాలన్‌ మాట్లాడుతూ... ''బాబి జాసూస్‌' పాత్ర అనగానే డిటెక్టివ్‌కు భార్యనో, ప్రేయసినో అనుకున్నా. కానీ దియా నువ్వే డిటెక్టివ్‌ అంది. మొదట యాచకురాలి వేషం వేశా. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర ఒకావిడ 'ఏదైనా పని చేసుకోవచ్చుగా?' అంది కూడా. ఇప్పుడు నా మారువేషాలన్నీ తెరపై చూసుకుంటుంటే భలేగా ఉంది'' అంటోంది.

  English summary
  The promos of ‘Bobby Jasoos’ have created a huge buzz and the producers have received an overwhelming response. While the various disguises carried out by Vidya Balan have created curiosity, the unusual pairing between Vidya and Ali Fazal has sparked an interest as well.Tollywood 
 Filmmakers are competing with each other to bag the rights of yet to be released Vidya Balan's film Bobby Jasoos.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more