twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రుద్రమ దేవి’ ఆడియన్స్ టాక్ ఎలా ఉంది?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రక చిత్రం ‘రుద్రమ దేవి'. కాకతీయ మహాసామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.

    కథ కోసం ఎంతో రీసెర్చ్ చేయడంతో పాటు దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమాను తీసారు. ఎన్నో వాయిదాలు, ఆటంకాల అనంతరం రుద్రమదేవి చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది.

    స్టార్ హీరోయిన్ అనుష్క టైటిల్ రోల్ చేయడం... మరో వైపు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ సినిమాలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రను పోషించడంతో సినిమా ముందు నుండీ అంచనాలు భారీగానే ఉన్నాయి.

    ఈ రోజు తెల్లవారు ఝాము నుండే రుద్రమదేవి షోలు మొదలయ్యాయి. మరి రుద్రమదేవి సినిమాను చూసిన ఆడియన్స్ స్పందన ఎలా ఉంది అనేది చూద్దాం....

    బాగా రీసెర్చ్ చేసి తీసారు

    సినిమాను బాగా రీసెర్చ్ చేసి సినిమా తీసారని చూసిన వారంటున్నారు.

    వరస్ట్ డిసిషన్

    ఈ సినిమాకు సంబంధించిన సంగీతం ఇళయ రాజాకు అప్పగించడం కొందరు విమర్శిచారు. కీరవాణి అయితే బావుండేదని అభిప్రాయం వ్యక్తం చేసారు.

    గోన గన్నారెడ్డి

    సినిమాలో గోన గన్నారెడ్డి ఎపిసోడ్ మాత్రమే ఇంట్రెస్టింగుగా ఉందని కొందరంటున్నారు.

    అనుష్క

    అనుష్క తన శక్తి మేర నటిచిందని, అయితే ఇతర అంశాలు పూర్ గా ఉన్నాయని అంటున్నారు.

    అల్లు అర్జున్

    సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు మాత్రమే ప్రశంసలు వస్తున్నాయి.

    బాహుబలి మైండ్ లో వద్దు

    బాహుబలి సినిమాను మైండ్ లో పెట్టుకోకుండా సినిమా చూడాలని, లేక పోతే డిసప్పాయింట్ అవుతారని అంటున్నారు.

    యావరేజ్ రేంటింగే

    యావరేజ్ రేంటింగే

    సినిమాకు చాలా మంది నుండి యావరేజ్ రెస్పాన్సే వస్తోంది.

    English summary
    Rudhramadevi offers to take you back to the 13th century and let you live in the Kakatiya dynasty. Read the Viewers review to know if Gunasekhar has really taken back to the era.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X