బిచ్చగాడు లాంటి హిట్ కోసం విజయ్ ఆంటోని.. కాశి ప్రీ రిలీజ్ ఈవెంట్‌!

By Rajababu

బిచ్చగాడు, భేతాలుడు లాంటి చిత్రాలు విజయ్ ఆంథోని విలక్షణ నటుడిగా నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరుచుకొన్నారు. విజయ్ ఆంటోనీ ఇటు తెలుగు ,అటు తమిళ బాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక మార్కెట్ ను కూడా సాధించుకున్నాడు. ఈ టాలెంటెడ్ హీరొ నటించిన తాజా చిత్రం "కాశి". ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆడియోన్స్ ను ఆకట్టుకొని మిలియన్ వ్యూస్‌ను సాధించింది.

Vijay Antonys Kaasi pre-release function in Hyderabad

అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపాటి తెలుగులో విడుదల చేయనున్నారు. భారీ పోటీ నడుమ అత్యధిక మొత్తం చెల్లించి ఈ చిత్రాన్ని దక్కించుకొన్నారు. తెలుగు-తమిళ భాషల్లో మే 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.

Vijay Antonys Kaasi pre-release function in Hyderabad

వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. విజయ్ ఆంథోనీ ప్రతి చిత్రంలో మాటలు ఓ హైలెట్ గా నిలుస్తాయి. ఈ చిత్రానికి సైతం భాష్య శ్రీ సమకూర్చిన సాంగ్స్ , డైలాగ్స్ ది బెస్ట్ గా ఉంటాయని నిర్మాతలు తెలిపారు. కాగా ఈ రోజు సాయంత్రం కాశి ప్రీ రిలీజ్ ఈవెంట్ దసపల్లా లొ అంగరంగ వైభవంగా జరుగనుంది.

Vijay Antonys Kaasi pre-release function in Hyderabad

విజయ్ ఆంటోనీ, అంజలి, సునైన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, రాకేష్ పృధ్వీ, గాల్విన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోనీ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, మాటలు: భాష్య శ్రీ. ఎడిటర్: లారెన్స్ కిషోర్, నిర్మాతలు: ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపాటి, రచన-దర్శకత్వం: కిరుతిగ ఉదయనిధి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X