»   » పవన్ సినిమా ఆగింది : ఆనందంలో ‘అన్న’!

పవన్ సినిమా ఆగింది : ఆనందంలో ‘అన్న’!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ నెల 9న విడుదల కావాల్సి ఉండగా.....రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో సినిమా విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు అటు సినిమా నిర్మాతలను, ఇటు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.

అయితే ఓ హీరో గారికి మాత్రం ఈ పరిణామాలు బాగా ప్లస్సవుతున్నాయి. ఆగస్టు 9న విడుదలకు సిద్దం అవుతున్న తమిళ హీరో విజయ్ చిత్రం 'అన్న'కు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో 'అన్న' యూనిట్ సభ్యులు ఆనందంగా ఉన్నారట.

విజయ్ టైటిల్ పాత్రధారిగా ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం 'తలైవా'. ఈ చిత్రాన్ని 3కె ఎంటర్టైన్మెంట్ సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బి.కాశీవిశ్వనాథం (కాశీ) 'అన్న' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

విజయ్ సరసన అందాల భామ అమలాపాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళంలో దాదాపు 3000థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

English summary
After trying his luck with 'Senhithudu' ( Nanban ) & 'Thupaki', Vijay for a consecutive 3rd time is having a Direct Dubbed release in Tollywood with 'Anna' ( Thalaivaa ). The film which releases on August 9 clashes with Pawan's AD which will make things difficult for Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu