»   » సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సాయి కుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ సిటీ పోలీసు శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు సాయి కుమార్ నిమితులయ్యారు. సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించినందుకుగాను నగర పోలీస్ కమీషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

విజయవాడ పోలీసులు ‘నాలుగో సింహం' పేరుతో ఓ యాప్ రూపొందించారు. జూన్ 21న సాయి కుమార్ చేతుల మీదుగా ఈ యాప్ విడుదల చేయనున్నారు. విజయవాడ కమీషనరేట్ పరిధిలో పోలీసులు పలు ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సాయి కుమార్ ప్రచార కర్తగా ఉండబోతున్నారు.

Vijayawada City Police Brand Ambassador Sai Kumar

తెలుగులో సాయికుమార్ నటించిన ‘పోలీస్ స్టోరీ' చిత్రం పెద్ద హిట్టయింది. పోలీస్ అంటే ఇలానే ఉండాలి అనే రీతిలో ఈ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో పాతుకు పోయింది. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే...కనిపించని ఆ నాలుగో సింమేరా పోలీస్ అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్ ఎవరూ మరిచిపోలేనంతగా పాపులర్ అయింది.

English summary
Sai Kumar is to be the brand ambassador for the Vijayawada city police department. Sai Kumar has been roped in by the AP city police department to spread various awareness campaigns taken by the police to the public.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu