»   » కాపీ వివాదం: చిక్కుల్లో బాహుబలి రచయిత

కాపీ వివాదం: చిక్కుల్లో బాహుబలి రచయిత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్రప్రసాద్... ఈ రెండు సినిమాలు భారీ విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అయితే ఆయన ‘బజరంగీ భాయి జాన్' కథ తనదే అంటూ మరో రచయిత ఇటీవల కేసు వేసారు.

Vijayendra Prasad in trouble over copyright violation

రచయత, టీవీ నిర్మాత అయిన మాహిమ్ జోషి ‘బజరంగీ భాయిజాన్' కథ తదనే అంటూ కాపీ రైట్ యాక్ట్ కింద 50 కోట్లకు సూట్ వేసారు. చాలా ఏళ్ల క్రితమే మాహిమ్ ఈ స్టోరీ రిజిస్టర్ చేయించారని, అయితే ‘బజరంగీ భాయిజాన్' సినిమా స్టోరీ తను రాసుకున్న స్టోరీ మాదిరిగానే ఉండటంతో కంప్లైంట్ చేసారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.

కోర్టు మాహిమ్ స్కిప్టుతో పాటు ‘బజరంగీ భాయి జాన్' సినిమాను పరిశీలించినట్లు తలుస్తోంది. రెండు స్టోరీల్లోనూ కొన్ని అంశాల్లో సారూప్యత ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అక్టోబర్ 21లోగా వివరణ ఇవ్వాలని నిర్మాతలు రాక్ లైన్ వెంకటేష్, సల్మాన్ ఖాన్, డైరెక్టర్ కబీర్ ఖాన్, రచయిత విజయేంద్రప్రసాద్ లకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

English summary
Writer Vijayendra Prasad, who shot fame all over the country after providing stories for block-buster movies ‘Baahubali’ and ‘Bajrangi Bhaijaan’ is now facing legal trouble from writer and TV producer Mahim Joshi.
Please Wait while comments are loading...