For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పేదలకు సాయం...రాజకీయ ఉద్దేశం లేదన్న హీరో

  By Srikanya
  |

  హైదరాబాద్‌: తమిళ హీరో విశాల్‌ సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్ అవుతూంటాయి. విశాల్ ఇక్కడ వాడే కావటం, అతని పందెం కోడి, భరణి, సెల్యూట్, వాడూ-వీడు చిత్రాలు బాగానే ఆడటం కూడా బిజినెస్ వర్గాల్లో క్రేజ్ ఉంది. ఆయన పుట్టిన రోజు నిన్న అంటే శ నివారం తమిళనాట ఘనంగా, సేవా కార్యక్రమాలతో జరిగింది.

  ఇక విశాల్‌ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగిన సందర్భంగా తన అభిమానులతో కలిసి ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కీళ్‌పాక్కంలోని వృద్ధాశ్రమానికి వాషింగ్‌ మెషిన్‌, ఎగ్మూరులో జరిగే కార్యక్రమంలో పేద విద్యార్థులకు షూలు, సాక్స్‌లు, ఓట్టేరిలోని పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, 250 మంది హిజ్రాలకు సాయం, ప్రత్యేక ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లు, ప్యారీస్‌ కార్నర్‌లోని వృద్ధులు, నిరాధరణకు గురైన విద్యార్థులకు వివిధ రకాల సాయం అందించారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  Vishal birthday celebrations

  అలాగే తిరువొత్తియూరులోని వడివుడైయమ్మన్‌ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో విశాల్‌ పాల్గొని మొక్కలు నాటారు. అక్కడి ఆశ్రమంలోని చిన్నారులకు భోజనం, పేదలకు సంక్షేమ సహాయాలు అందించారు. రాయపురం, తండయారుపేట, కాశిమేడులోని సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ట్రిప్లికేన్‌, కోడంబాక్కంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శనివారం జన్మించే చిన్నారులకు బంగారపు ఉంగరాన్ని బహుకరించారు. ఆటో డ్రైవర్లకు యూనిఫారం అందించారు.

  ఈ సేవా కార్యక్రమాల గురించి విశాల్‌ మాట్లాడుతూ... పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలన్నదే తన ఆశయమని, ప్రస్తుతం తన అభిమానుల ద్వారా వాటిని ఆచరణలో పెట్టానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని, తన తల్లి దేవి పేరిట ట్రస్టు ప్రారంభించానని, పేద విద్యార్థులకు సహకరించడానికే దానిని ఏర్పాటు చేశానన్నారు. అబ్దుల్‌ కలాంను తలచుకుని దానిని ప్రారంభించానని, రెండు రోజుల్లో 16 మంది విద్యార్థిని, విద్యార్థులకు కళాశాల విద్య నిమిత్తం ఆర్థిక సాయం అందించానని, అభిమానుల ద్వారా పేద విద్యార్థులను ఎంపిక చేసి సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

  తాజాగా విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'పాయుంపులి'ని తెలుగులో డబ్‌చేసి 'జయసూర్య'గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌నినటుడు విశాల్‌ ట్విట్టర్లో విడుదల చేశారు. సెప్టెబర్‌ 4న ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు విశాల్‌ ప్రకటించారు.

  Vishal birthday celebrations

  పందెంకోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో విశాల్ మరో చిత్రంతో టాలీవుడ్‌కు దగ్గరవుతున్నాడు. సుశీంద్రన్ దర్శకత్వంలో ‘పాయుమ్ పులి'గా తమిళంలో రూపొందుతున్న చిత్రం తెలుగులో ‘జయసూర్య'గా విడుదల చేస్తున్నారు.

  ఈ చిత్రాన్ని సర్వానంద రామ్ క్రియేషన్స్ పతాకంపై వడ్డి రామానుజం సారధ్యంలో జివ్వాజి రామాంజనేయులు తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

  ఈ చిత్రంలో విశాల్ సరసన కాజల్ జంటగా నటించింది. విశాల్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆగస్ట్ 21 చిత్ర ఆడియోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

  విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి, హారీష్ ఉత్తమన్, మురళీశర్మ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందించారు.

  English summary
  The tall dark handsome hunk of Kollywood, Vishal Krishna celebrates his birthday yeserday, 29th August. Vishals's upcoming movie is Jayasurya and it is directed by Sushindran. Kajal is the heroine of this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X