»   » హిట్ కొట్టేటట్లే ఉంది: మంచు విష్ణు ల‌క్కున్నోడు టీజర్ (వీడియో)

హిట్ కొట్టేటట్లే ఉంది: మంచు విష్ణు ల‌క్కున్నోడు టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు విష్ణు, బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక మోత్వాని జంట‌గా రూపొందుతోన్న ఎంట‌ర్‌టైన‌ర్ ల‌క్కున్నోడు. ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై ఎం.వి.స‌త్యనారాయ‌ణ నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా పోస్ట‌ర్‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌ చేసారు. ఆ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరిక్కడ ఈ టీజర్ ని చూడవచ్చు.

గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాలతో మంచి విజ‌యాల‌ను సాధించిన ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కిస్తున్నారు. దేనికైనా రెడీ, పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద హిట్స్ త‌ర్వాత మంచు విష్ణు, హ‌న్సిక హ్యాట్రిక్ హిట్ కోసం జ‌త క‌ట్టడంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Vishnu Manchu's Luckunnodu Teaser

నిర్మాత ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ల‌క్కున్నోడు చిత్రం చాలా చ‌క్క‌గా వ‌చ్చింది. రెండు సాంగ్స్ మిన‌హా టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా తెర‌కెక్కించారు. మంచు విష్ణు మార్క్ ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌తో సినిమా అంద‌రినీ అల‌రిస్తుంది. త్వర‌లోనే ఆడియో విడుద‌ల చేసి డిసెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. మంచు విష్ణు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మా ల‌క్కున్నోడు టీజ‌ర్‌ను విడుద‌ల చేసాం అన్నారు.

మంచు విష్ణు, హ‌న్సిక‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళి, ప్రభాస్ శ్రీను, స‌త్యం రాజేష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్ః చిన్నా, కెమెరా-పి.జి.విందా, మ్యూజిక్- అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్- డైమండ్ ర‌త్న‌బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్- విజ‌య్ కుమార్‌, ప్రొడ్యూస‌ర్- ఎం.వి.వి.స‌త్యనారాయ‌ణ‌, స్టోరీ..ద‌ర్శ‌క‌త్వం- రాజ్‌కిర‌ణ్‌.

English summary
The teaser of Vishnu Manchu's Luckunnodu has been unveiled on the eve of the actor's birthday. The one-minute-odd teaser makes the film most anticipating.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu