»   » వరుణ్ సందేశ్‌‌ పీకల మీదకు తెచ్చిన వితిక ఫోటో.. చావాలనుకొంటే 40 టాబ్లెట్లు..

వరుణ్ సందేశ్‌‌ పీకల మీదకు తెచ్చిన వితిక ఫోటో.. చావాలనుకొంటే 40 టాబ్లెట్లు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షేర్ ఆత్మాహత్యాయత్నం చేశారనే వార్తలు సినీ వర్గాలను షాక్ గురిచేశాయి. బుధవారం ఉదయమే ఈ వార్త మీడియాలో సంచలనంగా మారింది. వరుణ్ సందేశ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్న వితిక ఎందుకు సూసైడ్‌కు ప్రయత్నం చేశారనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో పరిస్థితి చేజారి పోతుందని భావించిన వరుణ్ సందేశ్ తన భార్యతో మీడియాకు ఓ ప్రకటన రిలీజ్ చేయించారు. లేకపోతే వరుణ్ సందేశ్ నిజంగా చిక్కుల్లో పడేవారేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

సోషల్ మీడియాలోకి అప్‌లోడ్ చేసిన ఫొటో

సోషల్ మీడియాలోకి అప్‌లోడ్ చేసిన ఫొటో

వితిక హాస్పిటల్‌లో చేరిందనే విషయం మీడియాకు ఎక్కడానికి కారణం సోషల్ మీడియాలోకి సెల్ఫీ అప్‌లోడ్ కావడమే. వితికను చూడటానికి వచ్చిన ఆమె స్నేహితులు ఆ ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ అంశం రచ్చరచ్చ అయింది. అసలు విషయం తెలియక వితిక ఆత్మహత్యకు ప్రయత్నించారనే వార్త ఇంటర్నెట్‌లో సంచలనమై కూర్చున్నది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నగరంలో లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావివచ్చింది.

Varun Sandesh's wife Vithika Sheru clears the rubbishes rumours on Her
మీడియాకు మెసేజ్‌తో పరిస్థితి అదుపులోకి..

మీడియాకు మెసేజ్‌తో పరిస్థితి అదుపులోకి..

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వరుణ్ సందేశ్ భార్యతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. వెంటనే సోషల్ మీడియాలో అసలు విషయం తెలిసేలా ఓ ట్వీట్ పెట్టమని సూచించినట్టు సమాచారం. దాంతో ఆమె స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో మెసేజ్ పెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా టీవీ ఛానెళ్లతో మాట్లాడి ఈ అంశంపై వాస్తవాలు వెల్లడిస్తానని చెప్పింది.

చావాలనుకొంటే.. 40 మింగేదాన్ని

చావాలనుకొంటే.. 40 మింగేదాన్ని

నిద్ర పట్టకపోవడంతో వితిక స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిన విషయం వాస్తమే. నిద్ర కోసం నాలుగు టాబ్లెట్లు వేసుకున్నాను. ఒకవేళ మరణించాలంటే 40 మాత్రలు మింగేదానిని కదా. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా నాకు ఆరోగ్య సమస్య తలెత్తింది. ఈ మధ్యలో మోతాదుకు మించి టాబ్లెట్లు మింగడంతో హాస్సిటల్‌లో చేరాల్సి వచ్చింది. హాస్పిటల్ తీసిన ఫొటోను చూసి నేను ఆత్మాహత్యాయత్నం చేశానని రూమర్ ప్రచారమైంది అని వితిక వెల్లడించారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన దంపతులు

అమెరికా నుంచి తిరిగి వచ్చిన దంపతులు

ఇటీవల అమెరికా పర్యటనను ముగించుకొని వరుణ్ సందేశ్ దంపతులు తిరిగి వచ్చారు. మూడు నెలలపాటు అమెరికాలో వరుణ్ సందేశ్ తన కుటుంబ సభ్యులతో జాలీగా గడిపారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత వాతావరణంలో మార్పులు, ఫుడ్ పాయిజన్ లాంటి అంశాలతో వితిక అనారోగ్యానికి గురిఅయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించిన సంఘటన చోటుచేసుకోవడం వరుణ్ సందేశ్‌కు చికాకుగా మారింది.

మరో నెలలో మొదటి వివాహా వార్షికోత్సవం

మరో నెలలో మొదటి వివాహా వార్షికోత్సవం

మరో నెల రోజుల్లో మొదటి వివాహా వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. మిత్రులు, సన్నిహితులను ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నాం. అలాంటప్పుడు నేను ఎందుకు ఆత్మహత్య చేసుకొంటాను అని వితిక చెప్పారు. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వచ్చిన వార్తలపై ఆమె ఒకింత షాక్‌కు గురయ్యారు.

English summary
Varun Sandesh's wife, heroine Vithika Sheru's attempt suicide created ripples in Telugu media. This news goes into web media very fast. Suddenly Varun Sandesh reacted and taken appropriate steps. Vithika gives details of her condition to media. Now this incident comes into normalcy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu