»   » అజిత్ పోస్టర్ కిరాక్.. ఇంటర్నెట్‌లో వివేకం మానియా!

అజిత్ పోస్టర్ కిరాక్.. ఇంటర్నెట్‌లో వివేకం మానియా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

థలా అజిత్ కుమార్ నటిస్తున్న వివేకం చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన రెండు ఫొటోలను చిత్ర నిర్మాతలు గురువారం విడుదల చేశారు. ఒక ఫొటోలో మంచు కొండల్లో మెషిన్ గన్‌ పట్టుకొని నేరస్థులను వేటాడుతున్న అజిత్ కిరాక్ రేపుతున్నది. అజిత్ ఫోటోను వివేకం మానియా అనే హ్యాష్ ట్యాగ్‌తో దర్శకుడు సిరుథై శివ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

విలన్‌గా వివేక్ ఓబెరాయ్

విలన్‌గా వివేక్ ఓబెరాయ్

బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ మరో పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ‘స్టైలిష్ హీరో థలాకు ధీటుగా మరో స్టైలిష్ హీరో వివేక్ విలన్‌గా నటిస్తున్నాడు. వివేక్ విలనిజాన్ని తెరపైన చూడాలనే ఆసక్తి మరింత పెరుగుతున్నది' అనే సందేశం, ఫొటోను ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

వరుసగా మూడోసారి

వరుసగా మూడోసారి

అజిత్‌తో డైరెక్టర్ శివకు ఇది మూడో చిత్రం. గతంలో వీరం, వేదాలమ్ చిత్రాలను థలాతో రూపొందించారు. తాజాగా వివేకం చిత్రాన్ని పవర్‌ఫుల్ కథతో నిర్మిస్తున్నారు. గతంలో సిక్స్ ప్యాక్‌తో కూడిన అజిత్ పోస్టర్ విడుదల చేయగా అనూహ్య స్పందన లభించింది.

పవర్ ఫుల్ యాక్షన్

పవర్ ఫుల్ యాక్షన్

అజిత్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ చిత్రం యాక్షన్‌తోపాటు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్ మెంట్ కూడా ఉంటుందని నిర్మాతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

జంటగా కాజల్, అక్షర

జంటగా కాజల్, అక్షర

థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న వివేకం చిత్రంలో కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు.

English summary
After Veeram, Vedalam Director Siva directing Ajith in third row. In the film, Ajith will be seen as a suave Interpol officer. On Thursday, the makers of Vivegam have released a kickass picture of Ajith Kumar on the sets, which went viral on the internet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu