twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా ఫ్లాప్..రెండో రోజే థియేటర్లో దారుణంగా పరిస్థితి.. వీకే నరేష్ సీరియల్ ట్వీట్లు

    |

    జనాలు థియేటర్లకు రావడం లేదని, సినిమా పరిశ్రమ మూత పడుతుందా? థియేటర్ల వ్యవస్థకు మనుగడ లేదా? అని గత రెండు నెలల క్రితం టాక్ వచ్చింది. అయితే ఆగస్ట్ నెలలో వచ్చిన హిట్లతో మళ్లీ ఊపిరి పోసుకుంది చిత్రపరిశ్రమ. నిర్మాతలు దారుణంగా నష్టపోతోన్నారని ఇలానే కంటిన్యూ అయితే ఇక నిర్మాతలు అనే వారే ఉండరని అంతా అనుకున్నారు. జనాలు సినిమాలను మెచ్చడం లేదని, థియేటర్ల వైపు చూడటం లేదని అంతా అనుకున్నారు. కానీ భ్రమలన్నీ తొలిగిపోయాయి.

     అన్నీ నష్టాలే..

    అన్నీ నష్టాలే..


    చిరంజీవి ఆచార్య, మహేష్ బాబు సర్కారు వారి పాట, రామ్ వారియర్, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, నాగ చైతన్య థాంక్యూ ఇలా ఎన్నెన్నో సినిమాలు దారుణంగా నష్టాలను మిగిల్చాయి. ఇష్టారీతిన టికెట్ రేట్లు పెంచడంతో చూసే నాథుడే లేకుండా పోయాడు. థియేటర్లన్నీ ఖాళీగా ఉండిపోయాయి. రెండో రోజే ఈ పరిస్థితి ఏర్పడింది.

    నివారణ చర్యలు..

    నివారణ చర్యలు..


    నిర్మాతలు కాస్త కళ్లు తెరిచారు. అత్యాశకు పోయి పెంచిన టికెట్ రేట్లను వారే తగ్గించారు. అయినా కూడా థియేటర్లకు జనాలు రాకుండా ఉండిపోయారు. దిల్ రాజు ఎఫ్ 3, థాంక్యూ సినిమాలకు టికెట్ రేట్లను తగ్గించినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే సమస్య టికెట్ రేట్లే కాదు ఇంకా ఉన్నాయన అర్థమైంది అందరికీ.

    ఆగస్టులో హిట్లు..

    ఆగస్టులో హిట్లు..


    ఆగస్టు నెలలో టాలీవుడ్ బాగా పుంజుకుంది. బింబిసార,సీతారామం, కార్తికేయ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. జనాలతో థియేటర్లు కళకళలాడుతూ వచ్చింది. ఇప్పటికే ఈ మూడు చిత్రాలదే డామినేషన్ ఉంది. లైగర్‌కు నెగెటివ్ టాక్ రావడంతో ఇంకా కార్తికేయ 2కి వసూళ్లు పెరిగే చాన్స్ ఉంది.

    అవి కూడా కారణాలే..

    అవి కూడా కారణాలే..


    టికెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు రావడం లేదని కరెక్టే. కానీ దానికి మించిన దోపిడి థియేటర్లలో జరుగుతోంది. కూల్ డ్రింక్, పాప్ కార్న్, పార్కింగ్ చార్జీలంటూ థియేటర్ యాజమాన్యం నిలువునా దోపిడీ చేస్తోంది. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రావడానికి కూడా జంకుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే విషయాన్ని నరేష్ చెప్పుకొచ్చాడు.

    వరుస ట్వీట్లు..

    వరుస ట్వీట్లు..


    సీనియర్ నటుడు నరేష్ స్పందిస్తూ.. ఒకప్పుడు సినిమాలు బాగా ఆడేవి.. కానీ ఇప్పుడు రెండో రోజు కూడా థియేటర్లు ఫుల్ కాకుండా ఖాళీగా ఉండే పరిస్థితులు వచ్చాయి.. వీటికి టికెట్ రేట్లతో పాటుగా.. థియేటర్లు చేస్తున్న పని కూడా తోడైంది.. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు(రూ. 20.30 ఉండాల్సినవి రూ. 300) పెంచారు.. ఒక ఫ్యామిలీ థియేటర్‌కు వచ్చి సినిమాను చూడాలంటే దాదాపు రూ. 2500 వరకు ఖర్చు అవుతుంది. ఇలా ఉంటే జనాలు థియేటర్లకు ఎందుకు వస్తారు.. కాస్త ఆలోచించండి అంటూ సెటైర్లు వేశాడు.

    English summary
    Actor VK Naresh makes interesting comments on ticket rate in Telugu states. He made tweets on to reduce production cost.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X