»   »  మరో 2 నెలలు వినాయక్ మౌనం, మెగా ఫ్యాన్స్ డీలా...

మరో 2 నెలలు వినాయక్ మౌనం, మెగా ఫ్యాన్స్ డీలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘అఖిల్' సినిమా విడుదలైంది. సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. నాగార్జున వారసుడు అనే ట్యాగ్, వివి వినాయక్ దర్శకత్వం అనే హైప్ కారణంగా తొలి రోజు ఓపెనింగ్స్ అదరిరాయి. పెర్ఫార్మెన్స్ పరంగా అఖిల్ కి మంచి మార్కులు పడ్డప్పటికీ....డైరెక్షన్ పరంగా వివి వినాయక్ తన స్థాయి చూపించలేక పోయారనే విమర్శ మాత్రం వినిపించింది.

అఖిల్ సినిమా విడుదలవ్వగానే వివి వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా మొదలవుతుందని అంతా అనుకున్నారు. అయితే పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. మరో వైపు వివి వినాయక్ కూడా రెండు నెలలు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చిరంజీవి 150వ సినిమా గురించి స్పందించడానికి కూడా వినాయక్ ఇష్టపడటం లేదు.

VV Vinayak take rest for two months

దీంతో ఈ ఏడాది కూడా చిరంజీవి సినిమా మొదలు కావడం లేదనే విషయం తేలిపోయింది. మెగా అభిమానులు డీలా పడ్డారు. మరి ఈ రెండు నెలల కాలంలో వివి వినాయక్ ఏం చేయబోతున్నారు? తన తర్వాతి సినిమాకు స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నారా? అనే చర్చనీయాంశం అయింది.

ఇప్పటి వరకైతే వినాయక్ తన నెక్ట్స్ మూవీ పలానా హీరోతో చేస్తున్నాను అంటూ ప్రకటన ఏమీ చేయలేదు. చిరంజీవితో నెక్ట్స్ మూవీ చేస్తున్నారని బయట ప్రచారం జరిగినా.... ఆయన మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు. వివి వినాయక్ ఎటూ తేల్చకుండా మౌనం పాటిస్తుండటంతో అభిమానులు డల్ అయిపోయారు.

English summary
Tllywood Director VV Vinayak has made it clear that he won't be starting any new movie in the coming months as he wants to take rest for two months.
Please Wait while comments are loading...