»   » మేమిద్దరం టామ్ అండ్ జెర్రీలు: చిరు...!?

మేమిద్దరం టామ్ అండ్ జెర్రీలు: చిరు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు..ఆ ఆలోచనలకీ, తన ఆలోచనలకీ అస్సలు పొంతన కుదరంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాల్లో బిజీగా వున్న తాను, సినిమాలపై దృష్టి పెట్టలేననీ, ఒక వేళ అభిమానుల నుండి డిమాండ్ ఎక్కువైతే, ఓ సినిమా లో నటించే ఛాన్స్ లేకపోలేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినిమా విషయంలో దర్శకుడిగా మారే ఆలోచనే లేదని అంటోన్న చిరంజీవి, మోహన్ బాబూ తాను టామ్ అండ్ జెర్రీ టైపు చిలిపి తగాదాలతో కాలక్షేపం చేస్తున్నా, తామిద్దరం మంచి స్నేహితులనీ చెబుతున్నారు.

జయప్రదం పేరిట, జయప్రద నిర్వహిస్తోన్న టాక్ షోలో చిరంజీవి తన మనసులోని మాటల్ని చాలానే బయటపెట్టారు. దర్శకత్వం చేయాల్సి వస్తే చరణ్ తోనా..పవన్ తోనా..అనడిగితే, పవన్ తో చేసే ఛాన్స్ లేనే లేదన్న చిరంజీవి, పవన్ తన ఆలోచనలకు చాలా దూరంగా వుంటాడనీ, చరణ్ అయితే తనకు చాలా కంఫర్ట్ గా వుంటుందని అన్నారు. ఆన్ స్క్రీన్ శ్రీదేవి తనకు ఫర్ఫెక్ట్ ఫెయిర్ అని చాలా మంది అంటుంటారని చెప్పిన చిరంజీవి, తనకు నచ్చిన, తాను మెచ్చిన హీరోయిన్లు చాలామందే వున్నారని ముసిముసి నవ్వులు నవ్వేశారు.

'గ్యాంగ్ లీడర్" రీమేక్ చేస్తే, అందులో చరణ్ నటించాలని వుందన్న చిరంజీవి, మగధీర" సినిమాతో తండ్రికి మించిన తనయుడంటూ చరణ్ కి అంతా ఇచ్చిన కితాబులు తనకు బోల్డంత పుత్రోత్సాహాన్ని తెచ్చి పెట్టాయని చిరంజీవి అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu