twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’డివైడ్ టాక్ ఎందుకంటే ... : శేఖర్ కమ్ముల

    By Srikanya
    |

    హైదారాబాద్ : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. వారం క్రితం విడుదలైన ఈ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో శేఖర్ కమ్ముల ఈ విషయమై ఆయన విశ్లేషణ చేసారు. ఆయన మాట్లాడుతూ... అవును...డివైడ్ టాక్ తోటే ఈ సినిమా మొదలైంది. చాలా మంది ప్రేక్షకులు హ్యాపీడేస్ ని మళ్లీ తీసినట్లుగా ఫీలయ్యారు. యంగస్టర్స్ కొందరు ఈ సినిమాలో మదర్ సెంటర్ మెంట్ తో ఎంటర్టైన్మెంట్ తగ్గిందని డిజప్పాయింట్ అయ్యారు. యువతకు ఈ సినిమా ఫస్టాఫ్ నచ్చితే...ఫ్యామిలీస్ కు సెకండాఫ్ నచ్చింది అన్నారు. ఈ సినిమాలో మల్టిఫుల్ లేయర్స్ ఉండటం వల్ల డివైడ్ టాక్ వచ్చింది. రెండో సారి చూసిన వారికి ఈ సినిమా నచ్చుతోంది.

    అయితే మూడో రోజు నుంచి అంటే సోమవారం నుంచి ఈ సినిమా టాక్ స్టెబిలైజ్ అయ్యింది. నిజానికి సోమవారం కలెక్షన్స్ బట్టే సినిమా జయాపజయాలు నిర్ణయిస్తూంటాం. అయితే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ కాలేదు. స్ట్రాంగ్ గా ఉంది. హైదరాబాద్ లో విడుదలైన 17 నాన్ మల్టిప్లెక్స్ ధియోటర్స్ లో కలెక్షన్స్ బాగున్నాయి. జనాలకి కంటెంట్ నచ్చకపోతే సినిమా ఖచ్చితంగా సోమవారం ఆ ప్రభావం కనపడేది. నైజాం తీసుకున్న దిల్ రాజు కూడా సినిమా కలెక్షన్స్ వైజ్ గా బాగుందని చెప్పారు అని చెప్పుకొచ్చారు.

    ఇక సినిమాలో ప్రధానంగా నిలిచిన పెద్ద చెట్టు, సరస్సు సీన్స్ ని గురించి చెపుతూ..వాటిని మైసూర్ కి మూడు గంటలు దూరంలో ఉన్న విలేజ్ షూట్ చేసాం. హైదరాబాద్ లో లక్ష రూపాయలు ఖర్చు అయ్యే దానికి అక్కడ రోజుకు ఆరు లక్షలు ఖర్చు అయ్యింది. అక్కడ పది రోజులు షూట్ చేసాం. కేవలం ఆ ఎపిసోడ్ కే యాభై లక్షలు ఖర్చైంది..అయినా సినిమాలో బ్యూటీఫుల్ గా ఆ సీన్స్ వచ్చాయి అన్నారు. ఇక తోట తరణి వేసిన కాలని సెట్ గురించి చెపుతూ...కోటి రూపాయలు ఖర్చు తో దాన్ని హైదరాబాద్ పద్మారావు నగర్ లో క్రియేట్ చేసాం. ముప్పై లక్షలు దాని మెయింటినెన్స్ కు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మొత్తం ఆ కాలినీలో 144 వర్కింగ్ డేస్ చేసాం అన్నారు.

    రెమ్యునేషన్స్ తో కలిసి ప్రొడక్షన్ కాస్ట్ గురించి చెప్తూ...దాదాపు ఏడు కోట్లు అయ్యింది. అయితే నేను రెమ్యునేషన్ గురించి అఫీషియల్ ఫిగర్స్ ఇవ్వలేను. కానీ మేము ఎక్సపీరియెన్సెడ్ హీరోయిన్స్ కి మాత్రం చాలా పెద్ద మొత్తాలే రెమ్యునేషన్స్ గా పే చేసాం అన్నారు. సినిమాని ఎంత వేగంగా పూర్తిచేయాల నుకు న్నా...నేను నెమ్మది. అందుకే ఈ ఆలస్యం. నా చిన్ననాటి నవ్వు, అమాయకత్వం, ఓల్డ్‌ స్టైల్‌ అన్నీ తెరకెక్కించే ముందు సిద్ధం చేసేందుకే 6నెలలు పట్టింది. లవ్‌, రొమాన్స్‌, అల్లరి, సెంటిమెంట్‌ అన్నీ ఉన్న ఆహ్లదకర సినిమా చేశాను. పేద్ద పేరొస్తుందని అమాయకత్వంతో తీశాను . అప్పుడు హ్యాపీడేస్‌ కాలేజీలో..ఇప్పుడు హ్యాపీడేస్‌ కాలనీలో! ఇది నా చిన్నతనం లాంటి సినిమా. అమాయకం.. ఆహ్లదం..అందమైన నవ్వు... అనుభూతి....ఇలా ఎన్నిటినో తెరపరిచాను ఈసారి అన్నారు శేఖర్‌ కమ్ముల.

    English summary
    Shekar Kammula says.."The film has started off with a divide talk. Most of the audiences felt that Happy Days story is retold. Some of the youngsters who prefer entertainment are disappointed with mother sentiment. Youth liked first half and family crowds/female liked the second half. But the film’s talk got stabilized on 3rd day. Monday morning show is the parameter for movie’s performance. LIB was going strong on Monday. This film was full in 17 Hyderabad non-multiplex theaters. Another reason for the divide talk is that there are too many angles/layers in the film. If you watch it again, you will enjoy finer nuances and different layers"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X