»   » ఇంతకీ ఇలియానా ఎవరు?అని అడిగి షాక్ ఇచ్చిన డైరక్టర్

ఇంతకీ ఇలియానా ఎవరు?అని అడిగి షాక్ ఇచ్చిన డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా త్వరలో మందాకిని గా బాలీవుడ్ తెరపై కన్పించనుందంటూ గత రెండు రోజులుగా మీడియాలో హోరెత్తి పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మందాకిని గా చేయబోతోందంటూ చెప్పుతున్న సినిమా వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై-2 డైరక్టర్ మాత్రం అస్సలు ఇలియానా ఎవరో తనకు తెలియదంటూ షాక్ ఇచ్చాడు. ఆమె పేరే ఇంతకు ముందు నేను ఎప్పుడూ వినలేదు. ఇంకా మా సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. ఎప్పుడయితే ఆ పాత్రకు ఎవరని తీసుకోవాలనేది ఫైనలైజ్ అవుతుందో అప్పుడు నేనే మీడియాకు చెప్తాను అన్నాడు. ఇక ముంబయ్ అండర్ వరల్డ్ నేపథ్యంలో ఇటీవల ఏక్తాకపూర్ నిర్మించిన 'ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్"లో దావూద్ ఇబ్రహీం పాత్రను ఇమ్రన్ హష్మి చేయగా.. మందాకిని పాత్రను ఎమీ కింగ్‌స్టన్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఏక్తాకపూర్ అనుకుంటున్నారు. ఈలోగా ఇలియానాపై ఈ రూమర్ పుట్టించేసి ఆమె పరువు తీసేసారు.

English summary
Barely 24 hours after news broke out in Bollywood that Goan beauty and Telugu heroine Ileana is all set to play 'Mandakini' role in 'Once Upon A Time in Mumbai-2' with Akshay Kumar, the director of the film says he doesn't even know her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu