»   » కాటమరాయుడు: జిమ్ లో పవన్, ఈ కొత్తమ్మాయి ఎవరు?

కాటమరాయుడు: జిమ్ లో పవన్, ఈ కొత్తమ్మాయి ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించిన పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈచిత్రానికి 'కాటమరాయుడు' అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించారు. 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్‌కల్యాణ్‌ 'కాటమరాయుడా కదిరి నరసింహుడా..' అంటూ పాట పాడారు. ఇపుడు అదే లైన్ తో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండటం విశేషం.


మొన్నటి వరకు పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న పవన్ మళ్లీ తన సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. ఇటీవల జరిగిన రాజకీయ సభల్లో పవన్ కళ్యాణ్ తన బ్రతుకుదెవురు కోసం సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.


సెప్టెంబర్ 24 నుండి

సెప్టెంబర్ 24 నుండి

ఆల్రెడీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 24న షూటింగులో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. దర్శకుడు డాలీ ఫ్యాక్షన్ ప్రేమ కథాంశాన్ని ప్రేక్షక రంజకంగా తెరకెక్కిస్తున్నారు.


జిమ్ లో వర్కౌట్లు

జిమ్ లో వర్కౌట్లు

సినిమాలో బాగా కనిపించాలంటే ఫిట్ నెస్ కంపల్సరీ. ఈ చిత్రం కోసం పవన్ జిమ్‌లో భారీగా వర్కవుట్స్ చేస్తున్నాడు. పర్సనల్ ట్రైనర్ సమక్షంలో పవన్ ట్రైనర్ గైడెన్స్ పాటిస్తూ రెగ్యలర్‌గా వర్కవుట్స్ చేస్తున్నాడట.


శృతి హాసన్

శృతి హాసన్

నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా శృతి హసన్ నటించనుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.


పవన్ సినిమాలో కొత్త అమ్మాయి

పవన్ సినిమాలో కొత్త అమ్మాయి

ఈ సినిమాలో యామినీ భాస్కర్ అనే కొత్తమ్మాయి కీలక పాత్ర పోషిస్తోందని సమాచారం. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి యామిని పాత్ర ఏమిటనేది తెలియడం లేదు.


ఎవరీ యామినీ?

ఎవరీ యామినీ?

యామిని భాస్కర్ ఇంతకముందు ‘కీచక' అనే సినిమాలో హీరోయిన్ పాత్ర చేసింది. అలాగే ‘రభస'లో ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులకు గుర్తిండిపోయేలా ఉంటుందని అంటున్నారు.


ఆశలన్నీ ఈ సినిమాపైనే

ఆశలన్నీ ఈ సినిమాపైనే

పవన్ ఇటీవల నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా కాటమరాయుడు మూవీపై అభిమానులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్టుకొట్టాలన్న కసితో ఉన్నారంతా చిత్ర యూనిట్ సభ్యులంతా.


వెంటనే మరో సినిమా

వెంటనే మరో సినిమా

ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమాకు సిద్ధమవ్వాలని నిర్ణయించుకున్నారట పవన్ కళ్యాణ్. నెక్ట్స్ ఆయన దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు.


English summary
Pawan Kalyan's forthcoming movie Katamarayudu shooting starts on 21 September. Actress Yamini Bhaskar of Keechaka and Titanic fame has been cast for a crucial role in it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu