»   » దియా మీర్జా, జయేద్ ఖాన్‌లపై జుహు బీచ్‌ షూటింగులో దాడి

దియా మీర్జా, జయేద్ ఖాన్‌లపై జుహు బీచ్‌ షూటింగులో దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబైలోని జుహు బీచ్‌లో దియా మీర్జా, జయేద్ ఖాన్‌లపై సామాజిక కార్యకర్తలు దాడి చేశారు. లవ్, బ్రేకప్ అండ్ జిందగీ సినిమా షూటింగ్ చేస్తుండగా ఈ దాడి జరిగింది. వారు అనుమతి తీసుకునే షూటింగ్ చేస్తున్నప్పటికీ దాడి జరిగింది. సినిమా పాట చిత్రీకరణ జరుగుతుండగా ఈ దాడి జరిగిందని దర్శకుడు, సహ నిర్మాత సాహిల్ సింఘా చెప్పారు. తాము అనుమతి తీసుకున్నామని, ఈ దాడి ఎందుకు జరిగిందో తెలియడం లేదని సింఘా అన్నారు.

దియా ఈ సినిమాలో ఫొటోగ్రాఫర్‌గా నటిస్తోందని, బయటి నుంచి వచ్చిన జయేద్‌ను తీసుకుని వెళ్లే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నామని, తన కళ్ల ద్వారా జయేద్‌కు ముంబైని చూపిస్తుందని ఆయన చెప్పారు. తమ పరిశ్రమ ప్రభుత్వాన్ని స్నేహపూర్వక వైఖరితోనే చూస్తోందని, అనుమతి తీసుకునే విషయంలో చట్టప్రకారమే వ్యవహరిస్తున్నామని నటి, సహ నిర్మాత దియా మీర్జా అన్నారు.

English summary
Newly turned producers Dia Mirza and Zayed Khan might have pulled it off well together so far but journey has not been so easy. The duo despite seeking legal permission for shooting of ‘Love, Breakup and Zindagi’ at different parts of Mumbai were attacked by social activists while filming at Juhu beach.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu