Don't Miss!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- News
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం..!!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu 6 అతను ఎప్పుడు బాత్రూమ్ లోకే, నో భయం.. ఇంగ్లీషులో జబర్దస్త్ ఫైమా ఫన్నీగా!
విపరీతమైన ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. తొలుత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సక్సెస్ సాధించడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్ కూడా పూర్తి కావొస్తుంది. ఈ ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేలో టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఆరుగురు ఇంటి సభ్యులు హౌజ్ లో ఉండగా వారిపై తన అభిప్రాయాలను పంచుకునేందుకు బీబీ కేఫ్ కు హాజరైంది జబర్దస్త్ కమెడియన్ ఫైమా.

ఎలిమినేట్ అయిన ఫైమా హాజరు..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బీబీ కేఫ్ కు ప్రస్తుత సీజన్ మాజీ కంటెస్టెంట్, జబర్దస్త్ లేడి కమెడియన్ ఫైమా హాజరైంది. ఆమెను బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి ఇంటర్వ్యూ చేసింది.

ఎవడికాడి జూస్...
కాఫీ షేర్ చేసుకోవడానికి ఇవాళ మన కెఫేకు వస్తున్నారు ఫైమా అని ఇన్వైట్ చేసింది యాంకర్ అరియానా గ్లోరి. బుజ్జులు.. బుజ్జులు.. అనే పాటకు ఫైమా, అరియానా గ్లోరి కలిసి స్టెప్పులు వేశారు. ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్ అని అరియానా అంటే గెట్ మి వన్ ఎవడికాడి జూస్ (అవకాడో జూస్) అని ఫైమా అంది. దీంతో ఒక్కసారిగా నవ్వేసింది అరియానా గ్లోరి. శ్రీహాన్ గురించి చెప్పమని ఇంగ్లీషులో అడిగింది అరియానా.

భయం కాలేదా ఫైమా..
శ్రీహాన్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్. హీ స్లీప్ ఎవ్రీ డే, ఈట్ ఎవ్రీడే, డ్రింక్ ఎవ్రీ డే, వాష్ రూమ్ గో ఆల్సో ఎవ్రీ డే అని నవ్వించింది ఫైమా. రేవంత్ అగ్రెషన్ గురించి వేలు చూపించడం గురించి ఇంగ్లీషులోనే అడిగింది అరియానా. నాట్ చూపించిన వేలు అని ఫైమా అంటే.. నీకు అప్పుడు భయం కాలేదా ఫైమా క్లోజ్ గా రేవంత్ ను చూసినప్పుడు ఏంటి ఇలా అరుస్తున్నాడని అరియానా అడిగితే.. 'నో భయం.. ఐయామ్ లైక్ లయన్' అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది ఫైమా.

ఆ నలుగురిలో..
ఈ సీజన్ లో స్ట్రాంగెస్ట్ వుమెన్ ఎవరు అని అరియానా గ్లోరి అడిగితే.. స్ట్రాంగ్ అంటే కండలు మండేలా ఉండాలా అని ఫైమా తిరిగి క్వశన్ చేస్తే చంపుతా అని అరియానా గ్లోరి అని నవ్వించింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటే నీ దృష్టిలో ఫీలింగ్ ఏంటి అని అరియానా అడిగితే.. తీసుకోకపోతే బాగుండు అనిపించిందని పైమా జవాబిచ్చింది. ఈ సీజన్ లో సూట్ కేస్ పట్టుకుని ఎవరు వస్తారని నీకు అనిపిస్తుందని అరియానా అడిగితే ఒకవేళ ఆ నలుగురిలో అంటూ ఫైమా చెబుతుండగా.. ప్రోమోను ఎండ్ చేశారు.
శ్రీ సత్య ఎలిమినేట్..
ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ 15వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో భాగంగా హౌజ్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ శ్రీ సత్య అని వార్తలు వినిపిస్తున్నాయి. ఓటింగ్ పోల్స్ లో కూడా చూసుకుంటే చివరి స్థానంలో సత్య ఉన్నట్లే తెలుస్తోంది. అంటే ఎప్పటిలానే గ్రాండ్ ఫినాలేలోకి ఐదుగురు ఇంటి సభ్యులు మాత్రమే వెళ్లనున్నారు. రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి భట్ వీరిలో టైటిల్ గెలిచేది ఎవరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది