Don't Miss!
- Sports
బుమ్రా బ్యాటింగ్ స్టైల్ అదిరింది: రవిశాస్త్రి: టెస్ట్ ఫార్మట్‌లో క్లీన్ కేప్టెన్సీ
- Technology
ఈ వస్తువులుంటే మీ ఇల్లు కూడా Smart Home గా మారుతుంది!
- News
జగ్గారెడ్డి సంచలన నిర్ణయం : ఓటుకు నోటుపై తాజాగా - చంద్రబాబు సైతం: టార్గెట్ రేవంత్..!!
- Finance
ఉద్యోగులకు మార్క్ జుకర్‌బర్గ్ ఫైరింగ్ మెసేజ్: ఏం చెప్పారంటే
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
Escaype Live Review: సిద్ధార్థ్ ఓటీటీ ఎంట్రీ ఎలా ఉందంటే?
వెబ్
సిరీస్
:
ఎస్కేప్
లైవ్
ఓటీటీ:
డిస్నీ
ప్లస్
హాట్‌స్టార్
స్ట్రీమింగ్
డేట్:
మే
20
&
మే
27
(2
ఎపిసోడ్స్)
మొత్తం
ఎపిసోడ్లు:
9
నటీనటులు:
సిద్దార్థ్,
జావేద్
జాఫెరి,
స్వస్తికా
ముఖర్జీ,
శ్వేతా
త్రిపాఠి,
వాలుస్చా
డి
సౌజా,
ప్లాబితా,
సుమేద్
ముద్గల్
కర్,
రిత్విక్
సాహోర్,
రోహిత్
చందేల్,
ఆద్య
శర్మ,
తదితరులు
దర్శకత్వం:
సిద్దార్థ్
తివారీ
కరోనా లాక్ డౌన్ తర్వాత మన వాళ్లకు వెబ్ సిరీస్ లు బాగా అలవాటు అయ్యాయి. ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ లతో పాటు కంటెంట్ ఉంటున్న దేశీ వెబ్ సిరీస్ లను సైతం ఆదరిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో 'ఎస్కేప్ లైవ్' అనే వెబ్ సీరిస్ విడుదలయింది. మాములుగా మన తెలుగు వాళ్లకు అంత ఆసక్తి ఉండకపోవును, కానీ మన తెలుగమ్మాయిల ఒకప్పటి కళల రాకుమారుడు సిద్ధార్థ్ నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ కావడంతో మంచి ఆసక్తి నెలకొంది. దానికి తోడు సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ సహా విడుదలైన ప్రమోషన్ల్ స్టఫ్ అంతా సిరీస్ మీద అంచనాలు పెరిగేలా చేసింది. మరి ఈ ఎస్కేప్ లైవ్ సిరీస్ ఎలా ఉంది? సౌత్ నార్త్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం.

ఎస్కేప్ లైవ్ కథ ఏమిటంటే?
బెంగళూరుకు చెందిన సాఫ్ట్ ఇంజినీర్ కృష్ణ రంగస్వామి(సిద్దార్థ్)కు తండ్రి లేకపోవడంతో తల్లి, చెల్లి బాధ్యతలు తానే తీసుకోవాల్సి వస్తుంది. దీంతో తన అర్హతకు తగిన ఉద్యోగం లభించినా జీతం తక్కువ ఉండడంతో, 'Escaype Live' లైవ్ అనే ఒక వీడియో షేరింగ్ యాప్‌లో మానిటర్‌గా చేరుతాడు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం దృష్ట్యా కృష్ణ సంప్రదాయాలకు, భారత దేశ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటాడు. ఇక తాను మానిటర్ చేసిన 'ఎస్కేప్ లైవ్'లో ఒక అశ్లీల వీడియోను బ్యాన్ చేయాలని చూడడంతో పెద్ద రచ్చ జరుగుతుంది. అక్కడి నుంచి రచ్చ మొదలవుతుంది. సిరీస్ మొత్తం మీద కృష్ణ ఒక పాత్ర మాత్రమే కాగా కృష్ణతోపాటు మరికొన్ని పాత్రల కథలు సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ కథలన్నిటికీ 'ఎస్కేప్ యాప్' కనెక్టింగ్ పాయింట్. హీనా(ప్లబితా బార్దాకర్), డార్కీ(సుమేధ్ ముద్గాల్కర్), డాన్స్ కీ రాణి(ఆద్యా శర్మ), స్పైడీ(రిత్విక్ షోరే), రాజ్ కుమార్(రోహిత్ చందేల్) వంటి వారు 3 కోట్ల బహుమతి కోసం పోరాడతారు. మరి ఆ 3 కోట్లు సాధించేందుకు వారు ఏం చేశారు? ఇందులో కృష్ణ పాత్ర ఏమిటి? ఫైనల్ గా తేలింది? ఏంటి అనేది కథ.

సిరీస్ ఎలా ఉందంటే?
పేరుకు ఇది సిరీస్ అయినా, మనం ఇది రోజూ నిత్యజీవితంలో చూసేదే. మొన్నీమధ్య మన దేశంలో బ్యాన్ అయిన టిక్ టాక్ లాంటి యాప్ నే కధాంశంగా తీసుకుని తెరకెక్కించారు. ప్రాంక్ పేరుతో సైకోలుగా మారుతున్న యువకులు, తమలోని ఆడతనాన్ని ఈ యాప్స్ ద్వారా బయటపెట్టుకున్న యువకులు, వయసుకు మించిన డాన్స్ లు చేసే చిన్నారులు, వీడియోల కోసం ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసులు చేసే యువకులు, డబ్బు కోసం పలు యాప్స్ లో అసభ్యంగా వీడియో లైవ్ లు ఇస్తున్న యువతులు ఇలా ఒక్కొక్కరిని స్పృశిస్తూ వారి జీవితాలు ఏంటి? ఎందుకు ఇలా తయారు అవుతున్నారు? వంటి విషయాలను తెరకెక్కించి సక్సెస్ సాధించారు. నిజానికి దర్శకుడు సిద్దార్థ్ తివారీ ఈ సబ్జెట్‌ను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. కానీ ఎక్కడా దాన్ని అథోసయోక్తి అనిపించకుండా ప్రేక్షకులను మెప్పించగలిగేలా సిరీస్ ను తెరకెక్కించారు. అంటే వందకు వంద శాతం అని చెప్పలేం కానీ తివారీ కొంతవరకు విజయం సాధించాడు. అయితే కథలో వేగం కరువవడంతో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రధాన పాత్రలను ఒకదాని తర్వాత ఒకటి చూపించాల్సి రావడం వల్ల ఖచ్చితంగా చికాకు అనిపిస్తుంది. అయితే మొదటి ఏడు ఎపిసోడ్స్ ముందు విడుదల చేసి మరో రెండు ఎపిసోడ్స్ వారం తరువాత విడుదల చేసి జనాల్లో ఆసక్తి పెంచారు.

నటీనటుల విషయానికి వస్తే:
సిద్దార్థ్
ఎప్పటిలాగానే
తనదైన
నటనతో
అదరకొట్టాడు
కానీ,
ఆయన
పాత్ర
పరిధి
చిన్నదే
కావడంతో
నటనకు
ఆస్కారం
లేదు.
ఉన్నంతలో
మెప్పించాడు.
మరీ
ముఖ్యంగా
సౌత్
ఇండియన్
వ్యక్తిగా
జీవించాడు.
ఇక
డ్యాన్స్
కీ
రాణిగా
నటించిన
11
ఏళ్ల
చిన్నారి
ఆద్య
ఐటెం
సాంగ్స్
కు
సైతం
డ్యాన్స్
చేస్తున్న
సన్నివేశాలు
చూడటం
కాస్త
ఇబ్బందికరమే,
అయినా
ఆమె
నటనతో
వావ్
అనిపించింది.
ప్లబితా
బార్దాకర్,
స్వస్తికా
ముఖర్జీలు
అయితే
పోటీపడి
నటించారు.
ఇక
ఫెటిష్
గాళ్
గా
ప్లబితా
రెచ్చిపోయింది.
రాజ్‌కుమార్/మీనా
కుమారి
పాత్రల్లో
రోహిత్
చందేల్
జీవించాడు.
డార్కీగా
సుమేద్
భయపెడతాడు,
పోలీస్
ఆఫీసర్
గా
ఆకాంక్ష
సింగ్
ధీ
చిన్న
పాత్రే
అయినా
మెప్పించారు.
ఇక
జావేద్
జాఫెరి,
శ్వేతా
త్రిపాఠి,
వాలుస్చా
డి
సౌజా,
రిత్విక్
సాహోర్,
తదితరులు
తమ
పాత్ర
పరిధి
మేర
నటించి
మెప్పించారు.

టెక్నికల్ విషయానికి వస్తే:
జయ మిశ్రా -సిద్ధార్థ్ కుమార్ తివారీ రాసిన ఎస్కేప్ లైవ్ "చాలా వరకు నిజం అనిపించే" కథ. అయితే ఎక్కువ భాగం మన చుట్టూ మనం చూసిన వాస్తవ సంఘటనల నుండి తీసుకోబడినప్పటికీ, కొంచెం నమ్మదగినదిగా అనిపించదు. ఇక రణ్వీర్ ప్రతాప్ సింగ్ డైలాగ్స్ బాగున్నాయి. సతీష్ వెంకట రమణ కెమరా పనితనం చూసి ఔరా అనాల్సిందే. చందన ఆరోరా ఎడిటింగ్ టేబుల్ మీద కాస్త ఎక్కువ ద్రుష్టి పెట్టాల్సిందే. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.

ఫైనల్ గా:
చిన్నారి ఆద్య డ్యాన్స్ సన్నివేశాలు, ప్లబితా ఫెటిష్ ఎక్స్ పెరిమెంట్, స్వస్తికా ముఖర్జీ రేప్ అటెంప్ట్, వంటి విషయాలు కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అయితే దర్శకుడు బయట ప్రపంచంలో జరుగుతున్న వాస్తవ ఘటనలను బుల్లితెరపై కళ్లకు కట్టినట్లు చూపించడాన్ని మెచ్చుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడగలిగే సిరీస్ కాదిది, సీరిస్ చూడాలంటే మీకు ఓపికతో పాటు ఖాళీ కూడా ఉండాలి.