For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss ఇంటిలో ఉండే అర్హత లేదు.. బిందు మాధవిని కడిగి పడేసిన నటరాజ్ మాస్టర్

  |

  బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొంటున్నది. గత 70 రోజులుగా ఇంటిలో టాస్క్‌లు ఆడుతూ, ఎమోషనల్‌గా రాణిస్తూ ఆటగాళ్లు టైటిల్ రేసులో దూసుకెళ్తున్నారు. అయితే చివరి అంకానికి చేరుకొన్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. బిగ్‌బాస్ షో ప్రయాణం చివరి దశకు చేరుకొన్నది. ఈ ఇంటిలో ఏ ముగ్గురికి టాప్‌ 5లో చేరే అవకాశం లేదని.. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉందని భావిస్తూ.. ఇంటిలోని ముగ్గురు సభ్యులను సూచించాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు వెల్లడించారు. అయితే ఈ టాస్క్‌ను బిందు మాధవి ప్రారంభిస్తూ..

  బిందు మాధవి టార్గెట్ చేయడంపై

  బిందు మాధవి టార్గెట్ చేయడంపై


  ఇంటిలోకి మా నాన్న వస్తూ.. ఈ బిగ్‌బాస్ హౌస్ మానసిక, శారీరక, వ్యక్తిత్వ వికాసానికి చిరునామా అని చెప్పారు అంటూ మిత్రా శర్మ, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్‌ను టార్గెట్ చేసింది. అయితే బిందు వాదనపై ఘాటుగా నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్ తిప్పికొట్టగా, మిత్రా శర్మ వ్యూహాత్మకంగా మౌనం వహించారు.

  బిందు మాధవికి అర్హత లేదు..

  బిందు మాధవికి అర్హత లేదు..


  బిగ్‌బాస్ ఇంటిలో ఉండటానికి అర్హత లేదని బిందు అనడంపై నటరాజ్‌ మాస్టర్ ఖండిస్తూ.. ఇంటిలో నీవు ఉండటానికి అర్హత లేదు. ఏ ఒక్క టాస్క్ కూడా ఆడటం లేదు. ఏలియన్ టాస్క్ తప్ప మరోటి ఆడిన దాఖలాలు లేవు. నీవు 4వ వారంలో ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తివి. మేము 70 వారాలుగా సొంతంగా గేమ్ ఆడుతూ ఈ స్థాయికి వచ్చావు. అలాంటి మాకు ఇంటిలో అర్హత లేదని ఎలా అంటావు అంటూ నటరాజ్ మాస్టర్ ఘాటుగా స్పందించాడు.

  నీలాంటి హీరోయిన్‌ను చూడలేదు అంటూ

  నీలాంటి హీరోయిన్‌ను చూడలేదు అంటూ


  బిందు మాధవి ఆరోపణలు తిప్పి కొడుతూ.. బిగ్‌బాస్‌లోకి రాక ముందే కుమ్మక్కై ఇంటిలోకి వచ్చారు. 2వ వారంలో జ్యోతిష్కుడి చేత ఆడపులి అంటూ చెప్పించుకొన్నావు. కానీ నీ గేమ్ ఏంటో అందరికి తెలుసు అని నటరాజ్ మాస్టర్ అంటే.. నీవు పాప కోసం ఆడుతున్నావు అని ఎమోషనల్‌గా ప్లే చేస్తున్నావు అని బిందు కౌంటర్ ఇస్తే.. నాకు తెలిసిన హీరోయిన్లలో ఇంత చెత్త బిహేవియర్ నీదే.. నేను 60 మంది హీరోయిన్లతో పనిచేశాను. కానీ నీలాంటి బిహేవియర్ చూడలేదు. మంచి బిహేవియర్ నేర్పించమని బిందు నాన్నకు చెబుతున్నాను. నీవు ఇంటిలో బాగా నటిస్తున్నావు, నీవు మహానటివి అని నటరాజ్ మాస్టర్ అన్నారు.

   నువ్వు, మీ నాన్న ఫెయిల్ అయ్యారు అంటూ

  నువ్వు, మీ నాన్న ఫెయిల్ అయ్యారు అంటూ


  అయితే నన్ను మహానటివి అని అంటే నేను గర్వపడుతాను. చాలా ఏళ్ల క్రితం నేను నటిని అవుదామని ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు మీరు మహానటి అంటే గర్వంగా ఉంది అని బిందు అంటే.. నువ్వు సక్సెస్ అయితే నంబర్ వన్ హీరోయిన్ అయి ఉండేదానివి. కానీ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ కావడంలో ఫెయిల్ అయ్యావు. మీ నాన్న కూడా మంచి కూతురుగా పెంచడంలో మీ నాన్న కూడా ఫెయిల్ అయ్యాడు అని నటరాజ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.

  దొంగ మాటలు కట్టిపెట్టు అంటూ

  దొంగ మాటలు కట్టిపెట్టు అంటూ


  బిందు మాధవి వాదనను ఖండిస్తూ.. అన్ని దొంగ మాటలు.. ఇంటిలో అందరితో అబద్దాలు చెబుతుంటావు. దొంగ మాటలు చెబుతూ కాలం గడిపావు. బాబా భాస్కర్ వచ్చాక.. నీవు అతడితో కలిసి నాటకాలు ఆడుతున్నావు. 4 వారాల్లోనే ఇంటికి వెళ్లాల్సిన కంటెస్టెంట్‌వు. సోషల్ మీడియా కారణంగా ఇన్ని రోజులు ఉన్నావు. నీ లాంటి హీరోయిన్‌ ఇంత వరకు చూడలేదు. తెలుగు ఆడపిల్ల అంటూ పరువు తీస్తున్నావు. దొంగ ఓట్లు కాకుండా నిజంగా ఓట్లు వేస్తే టాప్ 5కు వెళ్లదు. చెన్నై నుంచి వచ్చి ఇక్కడ నాటకాలు ఆడుతున్నది. మేము ఇక్కడ తెలుగు వాళ్లం. తెలుగు పరిశ్రమలోనే బతుకుతున్నాం అని నటరాజ్ మాస్టర్ అన్నారు.

  చెన్నై నుంచి వచ్చి..

  చెన్నై నుంచి వచ్చి..


  బిందు మాధవి బిహేవియర్‌పై నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్ సెటైర్స్ వేశారు. లాయర్ అయితే డబ్బు కోసం వాదిస్తావు. నీకు స్కూ లూజ్. మంచి కంటెస్టెంట్ల మధ్య ఒక పిచ్చి వాళ్లను వేస్తే వేస్తే ఎలా ఉంటుందో మా పరిస్థితి కూడా అలానే ఉంటుంది. మేమంతా తెలుగు వాళ్లం. తెలుగు ప్రేక్షకుల కోసం వినోదం అందిస్తున్నాం. చెన్నై నుంచి టైటిల్ కోసం రాలేదు అంటూ నటరాజ్ మాస్టర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు.

  English summary
  Bigg Boss Non Stop witness heat discussion in latest episode. Nataraj Master blasts Bindu Madhavi Behaviour in the house.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X