For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  PelliSandaD: ఎట్టకేలకు ఓటీటీలోకి పెళ్లిసందD.. ఇంత లేట్‌గా రావడానికి కారణమిదేనా!

  |

  తొలి తరం నుంచి ఇప్పటి వరకూ తెలుగు పరిశ్రమకు చెందిన ఎంతో మంది స్టార్లు తమ వారసులను హీరోలుగా పరిచయం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది కుర్రాళ్లు తెరంగేట్రం చేశారు. అయితే, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే గ్రాండ్ ఎంట్రీని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. తద్వారా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్.. తన కొడుకు రోషన్‌ను కూడా 'నిర్మల కాన్వెంట్' అనే చిత్రంతో ఇప్పటికే టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అయితే, ఆ చిత్రం అంతగా ఆడలేదు.

  యాంకర్ ప్రదీప్ క్యారెక్టర్ బయట పెట్టిన ఢీ డ్యాన్సర్.. ఫోన్ చేస్తే అలా అన్నాడంటూ ఎమోషనల్

  మొదటి చిత్రం నిరాశనే మిగిల్చడంతో కొంత గ్యాప్ తీసుకున్న రోషన్.. గత ఏడాది 'పెళ్లిసందD' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీని గౌరీ రోణంకి తెరకెక్కించారు. శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లి సందడి' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే టైటిల్‌లో వచ్చిన 'పెళ్లిసందD' మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో అవి మరింతగా ఎక్కువయ్యాయి. అందుకే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

  దసరా పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లిసందD' మూవీకి ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా నెగ్గుకు రావడం కష్టమేనన్న టాక్ కూడా వినిపించింది. కానీ, ఆ వెంటనే ఈ చిత్రం బాగా పుంజుకుంది. ఇలా వీకెండ్‌లో భారీగా.. ఆ తర్వాత మోస్తరుగా కలెక్షన్లు సాధిస్తూ హిట్ దిశగా పయనించింది. ఇక, ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లో కలుపుకుని దాదాపు రూ. 7 కోట్ల షేర్‌ను రాబట్టింది. తద్వారా క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాతలకు కోటి రూపాయలకు పైగానే లాభాలను కూడా అందించింది.

  Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి టాలీవుడ్ వారసుడు.. అందుకోసమే ఒప్పుకున్న యంగ్ హీరో

  PelliSandaD Movie Streaming on ZEE5 From June 24th

  ఈ మధ్య కాలంలో థియేటర్లలోకి వచ్చిన సినిమాలు నెల తిరగక ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ, 'పెళ్లిసందD' మూవీ మాత్రం విడుదలై 8 నెలలు దాటినా స్ట్రీమింగ్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాను జీ5లో డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 'వాళ్లు తమ వివాహాన్ని మర్చిపోలేని విధంగా చేసుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పెళ్లి సందడితో పెళ్లిళ్లకు సిద్ధం కండి. జూన్ 24 నుంచి జీ5లో వస్తుంది' అంటూ సోషల్ మీడియాలో సదరు సంస్థ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అవని కారణంగానే ఇంత ఆలస్యంగా రాబోతుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  యంగ్ స్టార్ రోషన్ హీరోగా శ్రీలీలా హీరోయిన్‌గా నటించిన చిత్రం 'పెళ్లిసందD'. ఈ మూవీని గౌరీ రోణంకి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు. దీన్ని ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం ఇచ్చారు.

  English summary
  Roshann, Sree Leela and K. Raghavendra Rao Did PelliSandaD Movie Under Gowri Ronanki Direction. This Movie Streaming on ZEE5 From June 24th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X