Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Dhamaka OTT: రవితేజ ధమాకా ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
మాస్ మహారాజ్ రవితేజ నటించిన దమాకా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట్లో ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ అయితే రాలేదు. అంతేకాకుండా రివ్యూలు కూడా చాలా నెగిటివ్ గానే వచ్చాయి. రెగ్యులర్ రవితేజ సినిమాల తరహాలోనే రొటీన్ గా ఉంది అని కొత్తగా ఏమీ లేదు అని కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ సినిమా మాస్ ఆడియోన్స్ నుంచి అందుకున్న సపోర్ట్ తో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
మిగతా సినిమాల నుంచి కూడా పోటీ లేకపోవడం వలన ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఒక విధంగా సినిమా రవితేజ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అందించిన సినిమాగా కూడా ఇది రికార్డు క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ధమాకా సినిమా ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదలపై కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను మొదట అమెజాన్ ప్రైమ్ అందుకుంది అని కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ధమాకా సినిమాను జనవరి 22వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ కూడా ఆ విషయాన్ని వారి వెబ్ సైట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
ఇక దమాకా సినిమాను ఓటీటీలో కూడా చూడాలని ఓవర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాస్ మహారాజ రవితేజ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించగా శ్రీలీల గ్లామరస్ బ్యూటీగా కనిపించింది. ఇక త్రినాధరావు నక్కిన డైరెక్టర్ చేసిన ఈ సినిమాకు బీమ్స్ అందించిన సంగీతం కూడా బాగా హెల్ప్ అయ్యింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.