For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాగుందని చెప్పడం అబద్దమే! (1000 అబద్దాలు రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  1.5/5
  హైదరాబాద్ : దర్శకుడిగా తెరంగ్రేటం చేసిన తొలినాళ్లలో విభిన్నమైన సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించిన తేజ అప్పట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. వరుస హిట్లతో తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్నాడు. కానీ ఆ తర్వాత తేజ ఫామ్ కోల్పోయాడు.

  మొదట్లో తీసిన మూడు నాలుగు సినిమాలు తప్ప అన్నీ ప్లాపులే. హిట్ కొట్టడానికి ఎన్ని ప్రయోగాలు చేసినా విఫలం అవుతూనే ఉన్నాడు. తాజాగా తేజ దర్శకత్వం వహించిన '1000 అబద్దాలు' చిత్రం విడుదలైంది. మరి తేజ చెప్పిన అబద్దాలు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాయో చూద్దాం..

  సత్య (సాయిరాం శంకర్) ఓ యాడ్ ఏజెన్సీ యజమాని. ఈ క్రమంలో సత్య(ఏస్తర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే అప్పటికే సత్యకు నిశ్చితార్థం అయిందని తెలుస్తుంది. మిగతాది స్లైడ్ షోలో...

  అబద్దాలతో ప్రేమలోకి

  అబద్దాలతో ప్రేమలోకి

  ఆమె ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో అబద్దాలు ఆడటం మొదలు పెడతాడు. నిశ్చితార్థం చెడగొట్టి మొత్తానికి ఆమెను పెళ్లాడుతాడు. అయితే తనను అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలుసుకుని అతనికి దూరం అవుతుంది. దూరమైన హీరోయిన్‌ను హీరో ఎలా దక్కించుకున్నాడు అనేది తర్వాతి కథ.

  పెర్ఫార్మెన్స్

  పెర్ఫార్మెన్స్

  సాయిరాం శంకర్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. మరీ అద్భుతం కాకపోయినా....జస్ట్ ఓకే అనిపించాడు. హీరోయిన్ ఏస్తర్ ఏ విషయంలోనూ ఆకట్టుకోలేక పోయింది. సినిమాలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పాత్ర నాగబాబు. టవర్ స్టార్‌గా హీరోయన్ ను ప్రేమించే పాత్రలో ప్రేక్షకులను నవ్వించాడు. నరేష్, హేమ, బాబు మోహన్, జోష్ రవి తదితరులు వారి పాత్రల మేరకు రాణించారు.

  దర్శకుడి వైఫల్యం

  దర్శకుడి వైఫల్యం

  వెయ్యి అబద్దాలైనా ఆడి ఓ పెళ్లి చేయాలనే కాన్సెప్టును ఎంచుకున్న దర్శకుడు తేజ ఆ విషయాన్ని ప్రేక్షక రంజకంగా చెప్పడంలో విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునే విధంగా లేదు. క్లైమాక్స్ కూడా వీక్. కథ, కథనాలు రొటీన్‌గా ఉన్నా...కొన్ని కామెడీని సీన్స్‌ను మాత్రం బాగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు. కొన్ని డైలాగ్స్ ఫర్వాలేదు.

  టెక్నికల్ పాయింట్స్

  టెక్నికల్ పాయింట్స్

  టెక్నికల్ అంశాల విషయానికొస్తే రమణ గోగుల సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ షార్ప్ గా ఉండాల్సింది.

  చివరగా...

  చివరగా...

  మొత్తానికి తేజ చెప్పిన 1000 అబద్దాలు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించ లేదనే చెప్పాలి. మెప్పించిందని చెబితే అబద్దమే అవుతుంది!

  ఇతర వివరాలు

  ఇతర వివరాలు

  నటీనటులు: సాయి రామ్ శంకర్, ఎస్తర్ , నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు
  మాటలు: మరుధూరి రాజా,
  సంగీతం: రమణగోగుల,
  కెమెరా: రసూల్ ఎల్లోర్,
  కళ: నరసింహవర్మ,
  ఎడిటింగ్: శంకర్,
  పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్.
  సమర్పణ: చిత్రం మూవీస్,
  నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.
  నిర్మాత : పాలడుగు సునీత

  English summary
  Cinematographer-turned-director Dharma Teja is known for his teen romance dramas like Jayam, Chitram and Nuvvu Nenu. But following the poor response to his last film Neeku Naaku Dash Dash, he has done something off the beaten path in his latest directorial venture 1000 Abaddalu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X