»   »  'అడవి'రాముడే

'అడవి'రాముడే

Subscribe to Filmibeat Telugu
Adavi Ramudu
-జలపతి గూడెల్లి
చిత్రం: అడవిరాముడు
నటీనటులు: ప్రభాస్‌, ఆర్తి అగర్వాల్‌, సీమ, రాజీవ్‌కనకాల, నాజర్‌ తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: చంటి అడ్డాల
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.గోపాల్‌

'పేరుగొప్ప - ఊరుదిబ్బ' దర్శకుడు బి.గోపాల్‌ తీసిన మరో తలాతోకాలేని చిత్రం ఇది. రాజ్‌కుమార్‌ సంతోషి రూపొందించిన హిందీ సినిమా 'బర్సాత్‌'కు ఇది కాపీ. ఈ సినిమా టైటిల్‌ మాదిరిగానే పాత స్టైల్‌లో తీసిన పరమ బోర్‌ చిత్రం. భరించడం కష్టం. 'నరసింహనాయుడు' వంటి సినిమా తీసిన బి.గోపాల్‌ తన కెరీర్‌ మొత్తంలో ఎక్కడా స్వయంప్రతిభను కనబర్చలేదు.

అది తన గత రెండు చిత్రాలలో ప్రతిఫలిస్తే, ఆ 'ప్రతిభ లేమి' ఇందులో మరీ ఎక్కవగా కన్పించింది. ప్రభాస్‌కు వచ్చిన ఇమేజ్‌ను, క్యాష్‌ చేసుకోవాలనే ఆత్రం తప్ప సినిమాలో ఎక్కడా 'సిన్సియారిటీ' కన్పించదు. ప్రభాస్‌ సోకాల్డ్‌ మాస్‌ అభిమానులకు కూడా వినోదం ఏ మాత్రం కలిగించదు.

రచయిత రాజేంద్రకుమార్‌ 'బర్సాత్‌' సినిమా చూసి వండిన ఈ కథకు తమ గొప్పలు తామే చెప్పుకునే రచయితలు పరుచూరి బ్రదర్స్‌ అందించిన స్క్రీన్‌ప్లేగానీ, సంభాషణలుగానీ చూస్తే వారికి పేరు ఎలా వచ్చిందబ్బా అని మరోసారి సందేహం కలుగుతుంది.

ప్రభాస్‌ ఓకే. అందంగా కన్పించడం తప్ప చేసేందేమీ లేదు. ఆర్తి అగర్వాల్‌ ఇక రెస్ట్‌ తీసుకుంటే ప్రేక్షకులకు రిలీఫ్‌ అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రెండేళ్లకే ఆర్తి లావుగా మోరితే, రమ్యకృష్ణ ఇంకా అందంగా కన్పించింది ఈ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ లో. గుడ్డిలో మెల్ల నాజర్‌ నటనే. మణిశర్మ సంగీతంతో సహా ఈ సినిమా అంతా నాసిరకమే. బ్మ్రనందం 'పులిరాజా' కామెడీ కాస్తా రిలీఫ్‌.

కథ చాలా సోది కథ. బుట్టాయగూడెం అనే గ్రామానికి చెందిన రామరాజు (ప్రభాస్‌)ను నాజర్‌ పెంచి పెద్ద చేస్తాడు. అసలు సిసలు వెనుకటి తెలుగు సినిమాల మాదిరిగానే, ధనవంతురాలైన హీరోయిన్‌ (ఆర్తి అగర్వాల్‌, సినిమాలో ఎంపీ కూతురు, పేరు మధు) చిన్నప్పుడు రామరాజుతో కొన్నాళ్ళు ఆ ఊళ్ళో పాటలు పాడుకొని, బాగా చదువుకోమని సలహా ఇచ్చి పట్నం వెళ్ళిపోతుంది. హీరోగారి కష్టపడి చదివికొని పెద్దయి, హీరోయిన్‌ చదివిన కాలేజ్‌లోనే చేరుతాడు.

ఓల్డ్‌ప్లేమ్‌ మళ్ళీ వెలుగుతుంది. ఇద్దరూ పాటలు పాడుకుంటారు. ఈలోపు ఆమెకు వాళ్ళనాన్న ఓ సంబంధం కుదురుస్తాడు. సో..హీరో, హీరోయిన్లు తిరిగి అడవిల్లోకి పారిపోతారు. ఆ తర్వాత హీరోయిన్‌ ఆరేసుకోబోయి పారేసుకుంటూ ఉంటే హీరో పాటలు పాడుకుంటూ చివరికి కథను సుఖాంతం చేస్తాడు.

Please Wait while comments are loading...