»   »  అనసూయ-సినిమా సమీక్ష

అనసూయ-సినిమా సమీక్ష

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anasuya
Anasuya

నటీనటులు-భూమిక, అబ్బాస్, రవిబాబు, నిఖిత, మెల్కొటే,
పావలా శ్యామల, చలపతిరావు, శరత్ తదితరులు.
మాటలు-నివాస్
సినిమాటోగ్రఫీ-సుధాకర్ రెడ్డి
ఎడిటింగ్-మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం-శేఖర్ చంద్ర
స్క్రీన్ ప్లే- పరుచూరి బ్రదర్స్
రచన, నిర్మాణం, దర్శకత్వం-రవిబాబు
విడుదల-డిసెంబర్ 21, 2007

అనసూయ సినిమా టీవీ చానెల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కథ ఆధారంగా సాగుతుంది. అనసూయ(భూమిక) తన వృత్తిలో భాగంగా ఒక పోలీస్ అధికారి(అబ్బాస్)ను కలుస్తుంది. అనసూయ అంటే ఆ స్మార్ట్ పోలీసాఫీసర్ కు ఇష్టం. అతని వీక్ నెస్ ను ఆధారంగా చేసుకొని అతనని తన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి సోర్స్ గా మలుచుకుంటుంది. నగరంలో జరుగుతున్న వరుస హత్యల వెనుక గులాబీ గోవింద్(రవిబాబు)హస్తం ఉండవచ్చని అనుమానిస్తారు. ఇదే విషయాన్ని అబ్బాస్ ద్వారా పసిగట్టిన అనసూయ అతనిని ట్రేస్ చేస్తుంది. అదే సమయంలో పోలీసులు అతనిని చుట్టుముడతారు. ఇది గ్రహించిన గోవింద్ తననుతాను చంపుకుంటాడు. గోవింద్ చనిపోయినా నగరంలో జరుగుతున్న హత్యలనేపథ్యం ఆగదు. ఇంతకు ఈ హత్యలు ఎందుకు, చేస్తున్నదెవరనే నేపథ్యంలో కథ సాగుతుంది.

మంత్ర సినిమాకు మల్లే అనసూయ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగుతుంది. రవిబాబు మరోమారు దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమా కూడా హాలీవుడ్ స్టైల్లోనే నడుస్తుంది. అనసూయగా చేసిన భూమిక తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేసింది. సాంకేతికంగా కూడా సినిమా ఉన్నతంగా రూపొందింది. సినిమాటోగ్రఫీ బావుంది. ఒక్కమాటలో చెప్పాలంటే హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తెలుగులో చూసిన అనుభూతిని అనసూయను చూసి పొందవచ్చు. మార్కెట్ మాటల్లో చెప్పాలంటే మంత్ర సినిమాకిది థ్రెట్ అనిచెప్పవచ్చు. ఈ రెండు సినిమాల కథలు వేరైనా రెండూ థ్రిల్లింగ్ సినిమాలే కావడం గమనించదగ్గ అంశం. అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు సినిమాలలో మాదిరిగా అనసూయ సినిమాలో అసభ్య సన్నివేశాలు లేకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. భూమిక నటనతోపాటు ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక వర్గం ప్రతిభ విషయంలో ఒకరితో ఒకరు పోటీపడినట్టుగా కనిపిస్తుంది. సీనియర్ కెమరామెన్ సుధాకర్ రెడ్డి పనితనం హాలీవుడ్ సినిమాలను తలపించింది. శేఖర్ చంద్ర సంగతం కూడా అంతే స్థాయిలో ఉంది. భూమిక చుట్టే కథ నడిచినా అబ్బాస్, నిఖిత, రవిబాబు నటన ఆకట్టుకుంటుంది. మొత్తంగా చెప్పాలంటే హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తెలుగులో చూసిన అనుభూతిని అనసూయను చూసి పొందవచ్చు.

(గమనిక: వినోదం అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు,కథన నైపున్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది. సినిమా జయాపజయాలకు మా రేటింగ్ కు సంబందం ఉండనవసరం లేదు)

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X