twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాబోయ్‌, బాచి!

    By Staff
    |

    Bachi
    -జలపతి
    చిత్రం: బాచి
    నటీనటులు: జగపతిబాబు, నీలాంబరి, మాస్టర్‌ తేజ,
    ప్రకాష్‌ రాజ్‌, కోట
    సంగీతం: చక్రి
    నిర్మాత: చంటి అడ్డాల
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

    తొలి చిత్రం బద్రి సూపర్‌ హిట్టవడంతో పూరి జగన్నాథ్‌ పై నిజంగానే ఒక నమ్మకం ఏర్పడింది. రెండో చిత్రం బాచితో దర్శకుడి సత్తా ఏమిటో తేలిపోయింది. బద్రి చిత్రాన్ని పవన్‌ కళ్యాణే డైరక్ట్‌ చేశాడన్న కామెంట్‌ బాచి సినిమా చూస్తే నిజమేననిపిస్తోంది. చిత్రంలో ఎక్కడా కంటిన్యూటీ లేకపోవడం, అతుకుల బొంత లాంటి స్క్రీన్‌ ప్లే, డైరక్టర్‌ కు, రైటర్‌ కు మాత్రమే అర్థమయ్యే జోకులతో కలగూరగంపలా రూపొందించాడీ చిత్రాన్ని దర్శకుడు. స్టైల్‌ తప్ప సబ్‌స్టెన్స్‌ లేని చిత్రం ఇది.

    బాచి(జగపతిబాబు)స్పెషల్‌ బ్రాంచ్‌ ఆఫీసర్‌. ఎప్పుడూ ఓ పిస్టల్‌ చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు. చీటికి, మాటికీ గాల్లోకి పేల్చేస్తుంటాడు(అదేదో చిన్నపిల్లలు ఆడుకునే పిస్ట్‌ ల్‌ లాగా). బాచితో సహా ఆయన టీం అంతా హాలీవుడ్‌ సినిమాల్లో మాదిరి పోలీస్‌ అని రాసి ఉన్న షర్ట్‌ లు ధరించి తిరుగుతుంటారు. లాటరీలో 50 కోట్లు సంపాదించిన ప్రకాష్‌ రాజ్‌ కు సెక్యురిటీగా ఉంటుంది ఈ టీం. బాచి ప్రేమించే అమ్మాయి-వెంకటలక్ష్మి(నీలాంబరి). ప్రొఫెషన్‌ జర్నలిజం. అన్ని తెలుగు సినిమాల్లో మాదిరిగానే వెంకటలక్ష్మి రిపోర్టర్‌ కమ్‌ ఫోటోగ్రాఫర్‌. ఎప్పుడూ భుజానికి ఓ కెమెరా వేసుకొని తిరుగుతుంటుంది. హబీబీ అనే ఒక పిల్లాడు దుబాయి నుంచి పార్శిల్‌ లో వస్తాడు బాచి దగ్గరికి. బాచి తన తండ్రి అని ఆ పిల్లాడు చెపుతాడు. దుబాయిలో ఉన్న తన అమ్మ ఇక్కడికి పంపించిందని వివరిస్తాడు.

    ఇక హబీబీకి తనకు ఎటువంటి సంబంధం లేదని తన ప్రియురాలు నీలాంబరిని నమ్మించలేక సతమతమవుతుంటాడు బాచి. ఈ లోగా కోట్ల రూపాయల అప్పు చేసి ప్రకాష్‌ రాజ్‌ ఉడాయిస్తాడు. ప్రకాష్‌ రాజ్‌ కు లాటరీ తగలలేదని, అదంతా మోసమని తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. చివరికి బాచి ప్రకాష్‌ రాజ్‌ ను బంధించి, హబీబీ అతని కొడుకేనని చెపుతాడు.

    విజయవాడకు చెందిన కోలా మోహన్‌ రావు లాటరీ మోసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కెమెరా వర్క్‌ ఒక్కటే చెప్పుకోదగ్గరీతిలో ఉంది. కొత్త సంగీత దర్శకుడు చక్రి నిరాశపరిచాడు. రీరికార్డింగ్‌ కూడా బాగాలేదు. ఇక జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌ ల నటన ఫర్వాలేదు. ఈ సినిమా ద్వారా పరిచయమైన నీలాంబరి నటన గురించి చెప్పుకోవడం దండగ. అందం కూడా అంతంతమాత్రమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X