»   » బ్రాండ్ బాబు మూవీ రివ్యూ

బ్రాండ్ బాబు మూవీ రివ్యూ

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Brand Babu Movie Review బ్రాండ్ బాబు మూవీ రివ్యూ

  Rating:
  2.5/5
  Star Cast: సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బా, మురళీ శర్మ, సత్యం రాజేష్, రాజా రవీంద్ర
  Director: ప్రభాకర్ పీ

  బుల్లితెర మీద స్టార్‌గా ఆకట్టుకొన్న నటుడు ప్రభాకర్ (ఈటీవీ) నెక్ట్స్ నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారారు. తొలి చిత్రంతోనే విమర్శకుల మెప్పు పొందిన ప్రభాకర్ మలి ప్రయత్నంగా దర్శకుడు మారుతితో కలిసి బ్రాండ్ బాబు చిత్రాన్ని రూపొందించారు. బ్రాండ్ బాబులుగా మురళీశర్మ, నూతన నటుడు సుమంత్ శైలేంద్రను ఎంచుకొన్నారు. ఇషా రెబ్బాను తన కథకు కీలక అంశంగా ఎంపిక చేసుకొన్నారు. ఇలా కొత్త బ్రాండ్ క్రియేట్ చేయడానికి ప్రభాకర్ చేసిన ప్రయత్నం సఫలమైందా? బ్రాండ్ ఇమేజ్ ఏ మేరకు పెరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

  బ్రాండ్ బాబు స్టోరి

  బ్రాండెడ్ వస్తువులు వాడాలన్న మహా పిచ్చి కలిగిన బిజినెస్ మాగ్నెట్ రత్నం ( మురళీశర్మ). తన ఇంట్లో వాళ్లతోపాటు కుమారుడు డైమండ్ రత్నం (సుమంత్ శైలేంద్ర)ను కూడా అలానే తయారు చేస్తాడు. తండ్రి మాదిరిగానే విలాసవంతమైన బ్రాండ్ వారే మనుషులు అనే ఫీలింగ్‌లో ఉంటాడు డైమండ్. ఈ క్రమంలో హోంమంత్రి ఇంట్లో పనిచేసే పేదింటి అమ్మాయి రాధ (ఇషా రెబ్బా)తో ఓ విచిత్రమైన కారణంగా పరిచయం జరుగుతుంది. రాధను హోమంత్రి కూతురు అని భ్రమపడిన డైమండ్ ఆమెను ప్రేమించడం మొదలుపెడుతాడు. తీరా నిశ్చితార్తం వరకు వచ్చే సరికి రాధ హోంమంత్రి కుమార్తే కాదని తెలుసుకొని డైమండ్‌తోపాటు తండ్రి రత్నం షాక్ తింటారు.

  బ్రాండ్ బాబు ప్రయాణం

  రాధ హోంమంత్రి కూతురు కాదని తెలుసుకోని బ్రాండెడ్ వ్యక్తి కాదన్న నెపంతో పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. పేదవారిని, మధ్య తరగతి వారిని మనుషులే కాదన్న దృష్టితో డైమండ్, రత్నం చూడటం వివాదంగా మారుతుంది. పేదవారిని కించపరిచే విధంగా మాట్లాడిన రత్నం కుటుంబంపై పేదలు సంఘ బహిష్కరణ విధిస్తారు?

  కథలో మలుపులు

  సంఘ బహిష్కరణకు గురైన రత్నం కుటుంబానికి ఎదురైన సమస్యలు ఏంటీ? రత్నం కుటుంబం తిరస్కారానికి గురైన రాధ పరిస్థితి ఏమిటీ? డైమండ్ ప్రేమను రాధ ఎలా గెలుచుకొన్నది. ఎలాంటి బ్రాండ్ వ్యాల్యూ లేని పేదింటి రాధను డైమండ్ ఇష్టపడ్డాడా? ఇష్టపడితే అందుకు బలమైన కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే బ్రాండ్ బాబు చిత్ర కథ.

  ఫస్టాఫ్ అనాలిసిస్

  బ్రాండెడ్ వస్తువులే వాడాలన్న పిచ్చి ఏ మేరకు ఉన్నదో చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధంగా చక్కటి నోట్‌తో, హ్యూమర్‌తో కథను ప్రారంభించడం రచయిత, దర్శకుడి విజన్‌కు అద్దం పట్టినట్టు కనిపిస్తుంది. తొలిభాగంలో బ్రాండ్‌ కోసం ఎంతకైనా తెగిస్తారనే అంశాన్ని మంచి సన్నివేశాలతో తొలిభాగం సాగిపోతుంది. ఇంటర్వెల్‌లో చక్కటి ట్విస్టు పెట్టడం ద్వారా రెండోభాగం ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది.

  సెకండాఫ్ అనాలిసిస్

  ఇక రెండో భాగంలో ప్రధాన సన్నివేశాలు సంఘ బహిష్కరణ సీన్లతో సాగుతుంది. అయితే బలమైన సన్నివేశాలు లేకపోవడం కొంత అతిగా అనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి తెలుగు సినిమాలో కనిపించే రెగ్యులర్ పంథాతోనే క్లైమాక్స్‌కు చేరుకొంటుంది. కరుడు గట్టిన బ్రాండ్ బాబు డైమండ్ మారడానికి బలమైన పాయింట్‌ను చూపించగలిగితే సినిమా మరోస్థాయికి చేరుకొనేది. కాకపోతే మురళీశర్మ ప్రాణాలు కాపాడటం అనే విషయం పేదలంటే మనుషులే అనే మార్పు తీసుకురావడం కన్విన్స్‌గా ఉంటుంది. ‘బ్రాండ్ లేదని బ్లడ్ వెనక్కి తిరిగిచ్చేవ్.. చచ్చిపోతావు' అని తండ్రికి డైమండ్ చెప్పే డైలాగ్ మంచి జస్టిఫికేషన్ ఇచ్చింది.

  ప్రభాకర్ పీ టేకింగ్

  తొలిభాగంలో శవం దగ్గర రిచ్ పీపుల్ అలా ఏడవకూడదు.. ఏడుపులోనూ హై క్లాస్ సొసైటీ విలువలు మెయింటెన్ చేయాలనే సన్నివేశాన్ని రచయిత మారుతితో కలిసి దర్శకుడు ప్రభాకర్ చాలా హ్యుమర్‌గా తెరకెక్కించారు. ఐస్ క్రీమ్ బండి ఎపిసోడ్ లాజిక్‌కు ఏ మాత్రం సంబంధం లేకుండా చాలా నాసిరకంగా ఉంది. తొలిచిత్రంతో పోల్చుకుంటే మెరుగైన టేకింగ్ కనిపించింది. దర్శకుడిగా ప్రభాకర్ మరోసారి తన సత్తాను రుజువు చేసుకొన్నాడు.

  తొలిపరిచయంతో శైలేంద్ర

  బ్రాండ్ బాబుగా తెలుగు సిని పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన సుమంత్ శైలెంద్రలో మంచి ఈజ్ కనిపించింది. కొత్త హీరో అనే ఫీలింగ్ ఎక్కడ కనిపించదు. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో డ్యాన్స్ విషయంలో ఓ అంచనాకు రాలేం. చివర్లో ఫైట్స్‌లో ఆకట్టుకొన్నాడు. డైలాగ్స్ పరంగా, నటనపరంగా ఒకే అనిపించినప్పటికీ.. ఇప్పుడున్న పోటీని తట్టుకోవాలంటే ఏదో విభిన్నంగా నటించాల్సిన అవసరం ఉంది.

  ప్రత్యేక ఆకర్షణగా ఇషా రెబ్బా

  రాధగా ఇషా రెబ్బా తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. డీ గ్లామర్ పాత్రలో కనిపించినప్పటికి మధ్య తరగతి యువతిగా ఇషా ప్రేక్షకుల మనుసులను దోచుకోవడం ఖాయం. సినిమా సినిమాకు ఇషాలో పరిణతి కనిపిస్తున్నది. అదే ఆమెకు పెద్ద హీరోల పక్కన నటించడానికి సహాయపడుతున్నది. కీలక సన్నివేశాల్లో ఇషా పెర్ఫార్మెన్స్ బాగుంది.

  మురళీశర్మ నటన హైలెట్

  బ్రాండ్ బాబు చిత్రానికి హీరో రత్నం పాత్రే. బ్రాండ్ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిగా మురళీశర్మ తన పాత్రలో జీవించాడు. ఇటీవల కాలంలో విజేత, తదితర చిత్రాల్లో అద్భుతంగా రాణించారు. బ్రాండ్ బాబుగా మురళీ నటన ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్ర కథను మురళీ శర్మ తన భుజాలపై మోశాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

  మిగితా పాత్రల్లో

  మిగితా పాత్రాల్లో సత్యం రాజేష్, రాజా రవీంద్ర, నల్ల వేణు, ఈ రోజుల్లో సాయి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. రాజా రవీంద్రది మంచి రోలే అయినప్పటికీ ఇతర పాత్రల మధ్య నలిగిపోయింది. హీరోకు బ్యాండ్ బాబులుగా నల్ల వేణు, సాయి జంట కామెడీ అక్కడక్కడ హాస్యాన్ని పండించింది.

  సాంకేతిక విభాగాల పనితీరు

  సాంకేతిక విభాగాల్లో పళని కార్తీక్ సినిమాటోగ్రఫి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఆయన కెమెరా పనితీరు వల్ల సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. ఎస్‌బీ ఉద్దవ్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపించింది. బ్రాండ్ బాబు చిత్రానికి మ్యూజిక్ చాలా మైనస్. నిశ్చితార్థం సాంగ్‌ చూస్తే గాలి జనార్ధన్‌రెడ్డి ఇంట్లో జరిగినప్పుడు తీసిన డిజిటిల్ ఇన్విటేషన్ వీడియో గుర్తుకు వచ్చింది. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యుండేది.

  ప్రోడక్షన్ వ్యాల్యూస్

  నిర్మాణ విలువలు బాగున్నాయి. హీరో సొంత సినిమా కావడంతో ఖర్చుకు వెనుకాడలేదనే ఫీలింగ్ కలుగుతుంది. నటీనటుల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడాల్సింది. మారుతి సింగిల్ పాయింట్ కథ బాగుంది. కాకపోతే కథా విస్తరణలో లాజిక్కులు, విజన్ మిస్సయింది.

  ఫైనల్‌గా

  బ్రాండ్ బాబు చిత్రం వీకెండ్ సినిమా ప్రేమికులు నచ్చేలా ఉంది. బ్రాండ్ పిచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని కొంత పంచుతుంది. కాకపోతే ప్రేక్షకుడిని కొన్నాళ్లు వెంటాడే పరిస్థితి లేకుండా అది సినిమా థియేటర్‌ వరకే పరిమితం కావడం కొంత మైనస్. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులకు ఇది బాగా నచ్చే అవకాశం ఉంది.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  • ఇషా రెబ్బా, శైలేంద్ర ఫెర్ఫార్మెన్స్
  • మురళీ శర్మ నటన
  • ప్రభాకర్ టేకింగ్
  • సినిమాటోగ్రఫి
  • ప్రొడక్షన్ వ్యాల్యూస్

  మైనస్ పాయింట్స్

  • మ్యూజిక్
  • స్క్రీన్ ప్లే, డైలాగ్స్
  • సెకండాఫ్

  తెర వెనుక, తెర ముందు

  నటీనటులు: సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బా, మురళీ శర్మ, సత్యం రాజేష్, రాజా రవీంద్ర, నల్ల వేణు తదితరులు
  దర్శకత్వం: ప్రభాకర్ పీ
  రచన: డైరెక్టర్ మారుతి
  నిర్మాతలు: శైలేంద్ర బాబు, మారుతి
  సంగీతం: జేబీ
  సినిమాటోగ్రఫీ: పళని కార్తీక్
  ఎడిటింగ్: ఎస్‌బీ ఉద్దవ్
  రిలీజ్ డేట్: 2018-08-03

  English summary
  Brand Babu movie is Prabhakar' second venture after Next Nuvve. Isha Rebba, Sumanth Shailendra are lead pair. Director Maruti pens for This movie. This movie released on August 3rd. In this occassion, Telugu Filmibeat brings exclusive review.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more